ఎస్సీ కార్పోరేషన్ ఎఇఓ విజయ)క్ష్మీకి వినతిపత్రం ఇస్తున్న కెవీపిఎస్ నాయకులు
ఎస్సీ కార్పోరేషన్లో పెండింగ్ బుణాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ఎస్సీకార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ సంస్త జిల్లా ప్రధానకార్యదర్శి నందిపాటి మనోహర్ మాట్లాడుతూ ఎస్సీ కార్పోరేషన్ ద్వారా బ్యాంక్‌లు ఇచ్చిన బుణాలను మాపీ చేయాలని ఎస్సీ కార్పోరేషన్‌కు రూ. 150కోట్లు ఇవ్వాలని, ఎస్సీ కార్పోరేషన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని కోరుతూ డిఆర్డిఎ ముందు ప్లేకార్డులతో ధర్నా నిర్వహించినట్లు చెప్పారు.
గత 4 ఏళ్లనుండి దళితులకు బుణాలు అందడం లేదని 2017-18లో 1385 యూనిట్లకు గాను 800 పైగా యూనిట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని 2018-19 358మంది స్కిల్డ్, 1385 మంది అన్‌స్కిల్డ్ 775 పెట్టి స్కీమ్ లోన్లు లక్ష్యంతో ఇంటర్వూలు పెట్టి నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరికి లోన్ రాలేదన్నారు. గత 2 సంవత్సరాల నుండి యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వకుండా దళితులను రాష్ర ్ట ప్రబుత్వం మోసగిస్తుందన్నారు. అన•తరం ఎస్సీ కార్పోరేషన్ ఎఇఓ విజయ)క్ష్మీకి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు గంటా బీమయ్య, మర్రి బాబురావు, తిరుపతయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.