దొడ్డు ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా, రాస్తారోకో
నర్సంపేట డివిజన్ లో రైతులు పండించిన దొడ్డు ధాన్యం 1075 రకం ఇంకొన్ని రకాల పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని నల్లబెల్లి, ఖానాపూర్ మండలాల్లో రాస్తా రొకో చేశారు. ఒక్కో బస్తాకు అదనంగా ఎటువంటి కారణం లేకుండా తేమ పేరుతో రైతుల వద్ద , తేమ లేకున్నా 5-10 కేజీలు ఎక్కువ గా దోచుకోవడాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులకు అండగా ఉండాల్సిన సొసైటీ నే ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఉండడం దురదృష్టకరం అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లిలో కాంగ్రెస్, ఖానాపూర్ లో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో రైతులు ధర్నా, రాస్తా రొకొలొ పాల్గొన్నారు.