Take a fresh look at your lifestyle.

మంత్రి హరీష్‌రావును కలిసిన ధర్మారం సర్పంచి రాజు

సిద్ధిపేట, జూలై 27 (ప్రజాతంత్ర బ్యూరో): సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ ‌మండలంలోని ధర్మారం సర్పంచి పిట్టల రాజు తన పుట్టినరోజును పురస్కరించు కుని ములుగు డివిజన్‌ ఆత్మ కమిటీ ఛైర్మన్‌ ‌గూండా రంగారెడ్డితో కలిసి మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును కలిశారు.

రాజుకు మంత్రి హరీష్‌రావు బర్త్‌డే విషెస్‌ ‌చెప్పడంతో పాటు శాలువాతో సన్మా నించి మొక్కను బహుకరించారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆశీస్సులు ఇచ్చిన మంత్రి హరీష్‌రావుకు సర్పంచి రాజు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ధర్మారం టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, కోఅప్షన్‌ ‌సభ్యుడు కృష్ణగౌడ్‌, ‌నరేష్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply