Take a fresh look at your lifestyle.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ధర్మల్‌ ‌స్కానింగ్‌

నాగర్‌ ‌కర్నూల్‌, ‌జూన్‌ 3.‌ప్రజాతంత్రవిలేకరి: నాగర్‌ ‌కర్నూల్‌, ‌కొల్లాపూర్‌ ‌తాలూకాల్లో కొన సాగనున్న 46 పదోవ తరగతి పరీక్షాకేంద్రాల చీఫ్‌ ‌సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్‌ అధి కారులతో బుధవారం లిటిల్‌ ‌ఫ్లవర్‌ ‌పాఠశాల లో డిఈవో గోవిందరాజులు,సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశంలో డిఇవో మాట్లా డుతూ మార్చి నెలలో ప్రారంభమైన పది పరీక్షలు కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డా యని, ఈనెల 8వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించేం దుకుప్రభు త్వం అనుమతించిందని, కరోనా వైరస్‌ ‌నేప థ్యంలో వాయిదాపడిన మిగతా 8 పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా పకడ్బందీఏర్పాట్లు సియస్‌ ‌లు చేయాలన్నారు.ముఖ్యంగా కోవిడ్‌-19 ‌నిబంధనలను పాటిస్తూ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.గతంలో 54 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించాం. ప్రస్తుతం జిల్లాలో మరో 32 కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు.మొత్తం 86 కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిఎస్‌, ‌డి వో లు ఏర్పా ట్లు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలలో వెలుతురు,గాలి సౌ కర్యాలు ఉన్నాయని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమవుతోంది గనుక అన్ని కేంద్రాల్లోని గదుల్లో ట్యూబ్‌లైట్‌, ‌ఫ్యాన్లు పరీక్షించుకొని పరీక్ష జరిగే సమయంలో విద్యుత్తు అంతరా యం కలగకుండా చూడాలని కలెక్టర్‌ ‌హైపవర్‌ ‌కమిటీ సమావేశం నిర్వహిం చి సెస్‌ అధికారులకు ఆదేశాలుజారీచేశారని తెలిపారు. విద్యార్థుల పరీక్షా సమయానికి అనుగుణం గా ఆయా రూట్లలో సర్వీసులు నడిపించాల ని ఆర్టీసీ అధికారులను ఆదేశించారని,నిర్ణీత సమయంలో పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరేలా ఏర్పాట్లు జరిగిందనితెలిపారు.పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు గ్రామీణ స్థాయిలో పంచాయతీ సిబ్బంది మున్సిపల్‌ ‌సిబ్బంది పరీక్షా కేంద్రాలను శుభ్రం చేసేలా చూడాలని డిపివో, మున్సిపల్‌ ‌కమిషనర్లకు జిల్లా కలెక్ట ర్‌ ఆదేశాలు జారీ చేశారని,హైపోక్లోరైడ్‌ ‌ద్రావ ణంతో కేంద్రాలను ప్రతీరోజూ శుభ్రం చేయిం చే బాధ్యతలను సిఎస్‌,‌డివో లు తీసుకోవాల న్నారు.

విద్యార్థులకు ముందుగానే పరీక్షా క్ఱేంద్రం సమాచారాన్ని అందజేయాల ని, పరీక్ష ప్రారం భం నిర్ణీత సమయానికి రెండు గంటల ముం దుగా సిబ్బంది అధికారులు, కేంద్రాల వద్ద గుమిగూడకూడదని,సామాజిక దూరం పా టించాలని, ప్రతీ పరీక్షా కేంద్రంలో విద్యాశాఖ విద్యార్థులకు ఉచితంగా మాస్కులు, శానిటై జర్లు అందించనుందని తప్పనిసరిగా మా స్కులు భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు ని ర్వహించాలన్నారు. కేంద్రాలలో హైపోక్లోరైడ్‌ ‌ద్రావణంతో ప్రతీరోజూ శుభ్రం చేయించాల న్నారు.ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక ధర్మల్‌ ‌స్కా నర్‌ ఏర్పాట్లు చేశామని, పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ ‌తో పరీక్షించి దగ్గు,జలుబు, జ్వరంతో ఎవరైనా విద్యార్థు లు బాధపడితే వారిని ప్రత్యేక గదులలో పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదే శించారు. కేంద్రాలకు వచ్చేవారు సామాజిక దూరం పాటించేలా చూడా లి. ఇన్విజిలేటర్లు, సూపరింటెండెంట్లకు గ్లౌజులు మాస్కులు శానిటైజర్‌ ‌లు అందజేస్తున్నట్లు డీఈవో తెలిపారు.గతంలో ఒక్కో పరీక్షాకేంద్రంలో 200 మంది విద్యార్థులు పరీక్ష రాసేవారు. ఇప్పుడు ఒక్కో పరీక్షా కేంద్రంలో 100 మంది రాయనున్నారు. ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు రాసేవారు ప్రస్తుతం 12 మంది రాసేలా సీటింగ్‌ అరేంజ్మెంట్‌ ‌చేయాలని ఒక బెంచికి ఒక విద్యార్థి మాత్రమే కూర్చునేలా జిగ్‌ ‌జాగ్‌ అరేంజ్మెంట్‌ ‌చేయాలన్నారు. విద్యా ర్థులకు గతంలో అందించిన పాత హాల్‌టి కెట్లే అనుమతి ఉంటుందని, హాల్‌టికెట్‌ ‌లేక పోతే వెబ్‌సైట్‌ ‌నుంచి డౌన్‌లోడ్‌ ‌చేసుకొని పరీక్ష రాయవచ్ఛని సూచించారు. విద్యార్థు లు, వారి తల్లిదండ్రులకు ఏవైనా సందేహా లుంటే నివృత్తి చేసుకునేందుకు జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పరీక్షల నిర్వహణ సమయంలో ఇబ్బందులు ఉంటే కార్యాలయ ఫోన్‌ ‌నెంబర్‌ 08540,226266, ‌ప్రభుత్వ పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖరరావు 7702775340 నెంబర్‌కు ఫోన్‌చేసి తెలియ జేయాలన్నారు. ప్రభుత్వ పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖరరావు, నోడల్‌ అధికారి కురుమయ్యలు పరీక్షల్లో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అధికారుల ప్రశ్నల సందేహాలను నివృత్తి చేశారు.జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ఓపెన్‌ ‌స్కూల్‌ ‌కోఆర్డినేటర్‌ ‌నాగరాజు, ఎస్‌ ‌పి సి ప్రసాద్‌ ‌గౌడ్‌, ఉమ్మడి పరీక్షల సహాయ కార్య దర్శి సత్యనారాయణ రెడ్డి, కార్యాలయ సిబ్బంది వెంకట్‌, ‌రవికుమార్‌, ‌నరసింహ, శ్రీకాంత్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply