Take a fresh look at your lifestyle.

వైసిపి పాలనపై తనది ధర్మ పోరాటం

  • తనపై బాంబు వేస్తానన్నా చలించని డిజిపి
  • ప్రజలు సమస్యలు తెలుసుకోవడానికి వస్తే అడ్డంకులా
  • నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలకు చెలగాటం
  • డ్రగ్స్‌పై ప్రశ్నిస్తే కేసులు పెడతారా
  • చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత
  • వైసిపి ఫ్లెక్సీలను చించివేసిన టిడిపి శ్రేణులు

చిత్తూరు,అక్టోబర్‌ 29 : ‌వైసీపీ అధర్మ పాలనపై తాను చేసేది ధర్మపోరాటమని మాజీ సిఎం, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రెండున్నరేళ్లుగా వైసిపి అక్రమాలు చేస్తూ తమపై దాడులను లోయంగా చేసుకుందన్నారు. అక్రమంగా కేసులు పెట్టడం, నేతలను జైళ్లకు పంపడం ఇదేనా పాలన అన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడులను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. తన సొంత నియోజక వర్గమైన కుప్పం నియోజక వర్గంలో పర్యటిస్తున్న ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదన్నారు. తన పర్యటనకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు తనకు లేదా అని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీసారు. తన ద బాంబు వేస్తామని ఒకాయన అంటున్నారని..అయితే తనను ప్రజా దేవుళ్లే కాపాడుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. తాను చేసేది ధర్మపోరాటమన్నారు.

ఎక్కడికొస్తారో రండి.. చూసుకుందాం, ధైర్యం ఉందా అని చంద్రబాబు సవాల్‌ ‌విసిరారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసి, టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. డీజీపీ ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి దాడి సమయంలో ఎందుకున్నాడని ఆయన ప్రశ్నించారు. నకిలీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఏపీని సారాయి, గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చా రన్నారు. అక్రమ కేసులకు భయపడి మేంసరెండర్‌ ‌కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు వదిలేసి పారిపోవాలా అని చంద్రబాబు నిలదీసారు. 70 లక్షల మందిసభ్యులున్న పార్టీటీడీపీ అని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని హెచ్చరించారు. తన పర్యటనకు వైసీపీ ప్రభుత్వం అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్‌ ‌పాలన తీరుపై మండిపడ్డారు. కుప్పం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళాను..రాష్ట్రపతిని కలిశాను. ఏపీలో పరిస్థితులను వివరించాను ఏపీలో రాష్ట్ర ప్రేరేపిత తీవ్రవాదం నడుస్తోంది. ఏపీని పరిపాలించే అర్హత వైసీపీకి లేదు. పేదప్రజలే దేవుళ్ళు-సమాజమే దేవాలయంగా ముందుకు సాగిన పార్టీ తెలుగుదేశం అన్నారు చంద్రబాబు. పోలీసు వ్యవస్థ సహకారంతో టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ ఆఫీసుపై డీజీపీ దాడి చేయించారు. కుప్పం లో పోలీసులు ఎక్కడ..? చోటా మోటా వైసీపీ నాయకులొస్తే భారీ భద్రత..ప్రతిపక్షనేత వస్తే పోలీసులు రారు..? నాపై బాంబులు వేస్తానని ఒక వైసీపీ నేత చెప్పాడు. అలిపిరిలో 24క్లైమోర్‌ ‌మెన్స్ ‌నన్ను ఏ చేయలేకపోయింది. నన్ను ప్రజలే కాపాడుకుంటారన్నారు. గంజాయికి కేరాఫ్‌ ‌విజయవాడ మారిందని ఆరోపించారు. ఏపీ నుంచే గంజాయి సరఫరా వివిధ రాష్టాల్రకు యథేచ్ఛగా సాగుతోంది. ప్రత్యేక హోదా తీసుకురాలేని జగన్‌ ‌కొత్త మద్యం బ్రాండ్‌ ‌లను తెస్తున్నాడు. మద్యపాన నిషేధానికి కొత్త అర్థం తెచ్చిన వ్యక్తి జగన్‌ ‌రెడ్డి అని విమర్శించారు.

ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయి. కోవిడ్‌ ‌లో కర్ఫూ ఉన్నా మద్యం షాపులు బార్లా తెరిచారు. 25సంవత్సరాలు మద్యపాన నిషేధం చేసే అవకాశమే లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆదాయం కోసం అక్రమమార్గాలు తొక్కుతున్నారు. ఏపీలో దొంగసారా తయారవుతోంది. గంజాయి, హెరాయిన్‌ ‌విచ్చలవిడి వాడకం జరుగుతోంది. ఏపీని డ్రగ్స్ ‌ఫ్రీ రాష్ట్రంగా మారుద్దాం. యువత భవిష్యత్తును కాపాడుకుందాం. పెద్దిరెడ్డి గురించి మాట్లాడితే బాంబు లేస్తారా? పెద్దిరెడ్డి ఏమైనా పుడంగా? డీజీపీ అపీసులో పని చేసే వ్యక్తి కి టీడీపీ ఆఫీసులో పనేంటి? రెండున్నర సంవత్సరాల కాలంలో ఎన్నో బూతులు మాట్లాడారు. ఇప్పుడు నేను బూతులు మాట్లాడుతున్నా అంటారు. నేను గట్టిగా మాట్లాడతాను కానీ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడను. రేషన్‌ ‌కార్డులు ఇవ్వరు.. పెన్షన్‌ ఇవ్వరు. నిత్యావసర ధరలు పెరిగిన కనీసం స్పందించరు . ఇక పెట్రోల్‌ ‌డీజిల్‌ ‌ధరల గురించి చెప్పేది లేదు అంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు రెండురోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం కుప్పం వచ్చారు. ఇదే సందర్భంలో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ప్లెక్సీల చించివేతకు ప్రతీకారంగా వైసీపీ ప్లెక్సీలను టీడీపీ శ్రేణులు చించివేశారు. ఆర్‌అం‌డ్‌బీ రోడ్‌ ‌నుంచి కుప్పంలోకి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన బ్యానర్లను టీడీపీ శ్రేణులు చించి వేశాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ప్రస్తుతం కుప్పంలో భారీ వర్షం పడుతోంది. చంద్రబాబు పర్యటనకు అంతరాయం ఏర్పడింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి.

Leave a Reply