Take a fresh look at your lifestyle.

దసరాకు ధరణి పోర్టల్‌

డాక్యుమెంట్‌  ‌రైటర్లకు శిక్షణ
రాష్ట్రవ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రేట్లు
సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయం

రాష్ట్రంలో అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారంగా భావిస్తున్న ధరణి పోర్టల్‌ను విజయ దశమి రోజున ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు. ధరణి పోర్టల్‌ ‌ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈలోపే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌, ‌హార్డ్‌వేర్‌, ‌బ్యాండ్‌ ‌విడ్త్‌లను సిద్ధం చేయాలని సూచించారు. మారిన రిజిస్ట్రేషన్‌ ‌విధానం, వెంటనే మ్యుటేషన్‌ ‌పూర్తి చేయడం, ధరణి పోర్టల్‌కు వివరాలను అప్‌డేట్‌ ‌చేయడం తదితర అంశాలతో పాటు సంబంధిత విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్‌ ‌రిజిస్ట్రార్‌లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు.

ప్రతీ మండలానికి ఒకరు చొప్పున, ప్రతీ సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ల నియామకాన్ని పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ధరణి పోర్టల్‌ ‌ప్రారంభం కావడానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా సర్వే నంబర్ల వారీగా రిజిస్ట్రేషన్‌ ‌రేట్లను నిర్ణయించనున్నట్లు చెప్పారు. అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. తహశీల్దార్‌ ‌కార్యాలయాలు, సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ ‌రైటర్స్‌కు లైసెన్సులు ఇచ్చి వారికి కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. డెమో ట్రయల్స్ ‌కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటా ధరణి పోర్టల్‌లో ఎంటర్‌ ‌చేయాలని అధికారులను కోరారు. ఆ తరువాత జరిగే మార్పులు చేర్పులను వెంటనే నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. దసరా రోజున ధరణి పోర్టల్‌ ‌ప్రారంభిస్తున్నందున అదే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమవుతాయని చెప్పారు. ఈలోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు, ఎలాంటి రెవెన్యూ వ్యవహారాలు జరగవని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply