Take a fresh look at your lifestyle.

లోపాలను సరిదిద్ది ‘ధరణి’ మరింత పటిష్టం

  • మరిన్ని ఆప్షన్లతో మెరుగు
  • రైతులకు ఇబ్బంది కలుగకూడదన్నదే ఉద్దేశ్యం
  • ఆశించిన ఫలితాలు సాధిస్తున్నది
  • ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

ప్రజాతంత్ర, హైదరాబాద్ : ‌ధరణి పోర్టల్‌లో లోపాలను ఉంటే సరిదిద్ది మరింత బలోపేతం చేయాలని సిఎం కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగు పరుస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ‌వెల్లడించారు. ధరణి పోర్టల్‌ ‌నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గురువారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్టేన్ల్రు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్‌ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వొద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతు న్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల వ్యవధిలోనే లక్షా 6వేల మంది ధరణి ద్వారా స్లాట్‌ ‌బుక్‌ ‌చేసుకుని, వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసుకున్నారని సిఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు 5 ఎకరాలలోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్‌ ‌చేయించకుని, మ్యుటేషన్‌ ‌చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని సిఎం చెప్పారు.

వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్దిపాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు రెండు నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని సిఎం ప్రకటించారు. డాక్యుమెంట్ల ఆధారంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్‌ ‌చేయాలని సూచించారు. సేవ ద్వారా మ్యుటేషన్‌ ‌దరఖాస్తులు స్వీకరించి, స్లాట్లు కేటాయించాలని ఆదేశించారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను.. కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలని కేసీఆర్‌ అన్నారు. రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకొకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలన్నారు. సరిహద్దు వివాదాలున్న చోట జిల్లా కలెక్టర్లు సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలని, 1/70 చట్టం అమలులో లేని ప్రాంతాల్లో ఆ చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించాలన్నారు. 1/70 చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో భూములపై ఆ ప్రాంత ఎస్టీల హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని చోట్ల ఒకే సర్వే నెంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్నాయని, ఆ సర్వే నెంబరును నిషేధిత జాబితా (22/ఎ) లో పెట్టారని, అలా పెట్టిన చోట్ల కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ భూమలో, ఏది ప్రైవేటు భూమో నిర్ణయించాలన్నారు. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్‌ ‌పుస్తకాలు ఇవ్వాలన్నారు.

కోర్టుల ద్వారా, కలెక్టర్ల ఆధ్వర్యంలోని ట్రిబ్యునళ్ల ద్వారా వచ్చిన అధికారిక తీర్పుల ప్రకారం ధరణిలో భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేపట్టాలి. కోర్టు పోర్టల్‌ను ధరణిలో చేర్చాలి. ధరణి పోర్టల్‌ ‌ద్వారా లీజ్‌ అ‌గ్రిమెంటు రిజిస్టేష్రన్‌ ‌చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. నాలా ద్వారా కన్వర్ట్ అయిన భూముల వివరాలను ధరణిలో నమోదు చేసి, వాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి.అగ్రిమెంట్‌ ఆఫ్‌ ‌సేల్‌ ‌కమ్‌ ‌జిపిఏ చేసుకోవడానికి ధరణి పోర్టల్‌ ‌ద్వారా అవకాశం ఇవ్వాలని సీఎం తెలిపారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వొచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. క్రమబద్దీకరించిన సాదాబైనామాల ప్రకారం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలి. పట్టాదారు పాస్‌ ‌బుక్కులు ఇవ్వాలి. కోర్టుల విచారణలో ఉన్నవి మినహా, భూ రికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్ – ‌బి లో పెట్టిన వ్యవసాయ భూములకు సంబంధించిన అంశాలన్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలి. అవసరమైన సందర్భాల్లో కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలి. యాజమాన్య హక్కులను ఖరారు చేయాలన్నారు. రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకొకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలన్నారు.

మైనర్ల పేరిట భూములు రిజిస్ట్రేషన్‌ ‌చేసే సందర్భంలో మైనర్లు, సంరక్షుల పేర పట్టాదారు పాస్‌ ‌పుస్తకం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అసైన్‌ ‌చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించాలన్నారు. పట్టాదార్‌ ‌పాసుబుక్కులు పోయినట్లయితే, వాటి స్థానంలో ట్రూ కాపీ తీసుకునే అవకాశం కల్పించాలి. పైన పేర్కొన్న మార్పులు, చేర్పులు చేపడితే ధరణి పోర్టల్‌ ‌ద్వారా మరింత సమర్థవంతంగా భూముల రిజిస్టేష్రన్‌ ‌చేయడం సాధ్యమవుతుందని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కెటి రామారావు, వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్‌, ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌సిఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌ ‌రావు, శేషాద్రి, కార్యదర్శి స్మితా సభర్వాల్‌, ‌సేవ సిఇవో వెంకటేశ్వర్‌ ‌రావు, రెవెన్యూ వ్యవహారాల నిపుణులైన రిటైర్డ్ ఐఎఎస్‌ అధికారులు రామయ్య, సుందర్‌ అబ్నార్‌, ‌రఫత్‌ అలీ, కలెక్టర్లు వెంకట్రాం రెడ్డి, హనుమంతరావు, ప్రశాంత్‌ ‌పాటిల్‌, ‌నారాయణరెడ్డి, శశాంక్‌, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, ‌మర్రి జనార్థన్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply