Take a fresh look at your lifestyle.

‘‌ధనిక వాడ’’!

చూడు దళితుల్లో సంబురం
హూజురాబాదులో అంబరం

అట్టహాసంగా ప్రారంభం
ఆర్థిక పురోగతికి ఆరంభం

‘రాజు’ తలుచుకున్నడట
నిధులకు కొరతరాదట

అందరూ  అర్హులేనట
పది లక్షలు ఇచ్చుడేనట

‘ధర్మప్రభువు’ గా అవతరణ
సర్కార్‌ ‌జాబోళ్ళకూ వితరణ

వంగి వంగి ‘కాళ్ళ’ కు దండాలు
అదిగో ‘కారు’ కు ఓట్ల దండలు

‘అతడు’  కోరుకున్నది అదే!!
‘కళ్ళ’ కు కనపడుతున్నదీ గదే!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply