Take a fresh look at your lifestyle.

కొవిడ్‌ లక్షణాలుంటే సెలవు తీసుకోండి’ పోలీసులకు సూచించిన డీజీపీ మహేందర్‌ రెడ్డి

కరోనా వైరస్‌ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న పోలీసులు, అధికారులు విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని.. దీనివల్ల కొందరు పోలీసులు వైరస్‌ బారిన పడ్డారని ఆయన తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులు, అధికారులు కొవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే సెలవు పెట్టాలన్నారు. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే వైరస్‌ ఇతరులకు సోకదని ఆయన చెప్పారు. పోలీసులు సెలవు అడిగిన వెంటనే యూనిట్‌ అధికారులు అనుమతి ఇవ్వాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి సూచించారు.

Leave a Reply