మేడారం జాతరకు భక్తజనం బయలుదేరింది. తెలంగాణ కుంభమేళా ఆదివాసుల అతి పెద్ద ఉత్సవం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం నుండి శనివారం వరకు నిర్వహించు జాతరకు భక్తకోటి జనం తండోపతండాలుగా మేడారానికి బయలుదేరారు. హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో ఏర్పాటుచేసిన రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్టాండ్ నుండి పెద్ద ఎత్తున భక్తజనం మేడారం నాకు తరలి వెళ్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కోటి 55 లక్షల వరకు భక్తులకు జాతరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఇందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకు మంచినీటి వసతి కల్పించినట్లు ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ దేవేందర్ తెలిపారు. భక్తులు ప్రైవేటు వాహనాలలో కాకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు.
ఈనెల 5 నుండి 8 వరకు నిర్వహించే జాతరలో గుడి మెలిగే, మండ మిలిగే పండుగలతో 2 వారాల క్రితం నుంచి గిరిజన సాంప్రదాయ ప్రకారం పూజలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే దక్షిణాది మహా కుంభమేళ పిలిచే మహా జాతర తొలి ఘట్టం మంగళవారం నుంచి మొదలయ్యాయి. ప్రపంచ దృష్టిని ఆకర్షించే శక్తి గల సమ్మక్క-సారలమ్మ జాతరకు కోట్లాది మంది భక్తులు హాజరవుతారు ఈ మహా జాతర లో తొలి ఘట్టం మంగళవారం మొదలు కానుంది. బుధవారం నుండి అధికారికంగా జాతర మొదలవుతుంది మేడారం గద్దెలకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గ్రామం, కన్నెపల్లి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత సరల మనం వడ్డెలు మేడారంలోని అత్యంత భక్తి శ్రద్ధలతో కోరుకుంటూ గద్దెల వరకు తీసుకు వస్తారు. వరంగల్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారలమ్మ జాతరకు పోవడానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సులో పెద్దవారికి 190, చిన్నవారికి 110 రూపాయలు టికెట్లు గా కేటాయించినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ బుధవారం నుండి అధికారికంగా నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతర కోసం పెద్ద ఎత్తున భక్తజనం తరలిరావడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Tags: Devotees,horoscope,Medaram,telangana