Take a fresh look at your lifestyle.

తిరుమలకు క్రమంగా పెరుగుతున్న భక్తులు

రథసప్తమికి ఘనంగా ఏర్పాట్లు
కొరోనా నేపథ్యంలో మూతపడి..నిబంధనల మేరకు తెరుచుకున్న తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే తిరుమల కొండపైన కూడా మొదటిలాగా భక్తులు ఉండటం లేదు. అయితే ఆదివారం రికార్డు స్థాయిలో 56448 మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. కేవలం తలనీలాలు సమర్పించిన భక్తులే 27323 మంది ఉన్నారు. ఇక హుండి ఆదాయం 3.63 కోట్లుగా ఉంది. లాక్‌ ‌డౌన్‌ అనంతరం ఆదివారంఅత్యధిక సంఖ్యలో శ్రీ వారిని దర్శించుకున్నారు. ఇక ఈనెల 19వ తేదిన రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.

ఈ క్రమంలో ఆర్జిత సేవలను రద్దు చేసింది టిటిడి. ఉదయం 6.38 నిముషాలకు శ్రీవారి పాదాలను సూర్యకిరణాలు స్పుశ్రించనున్నాయి. రథసప్తమి పర్వదినం రోజున సప్తవాహనాలపై భర్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. అయితే దర్శన టోకెన్లు కలిగిన భక్తులును మాత్రమే గ్యాలరీలోకి అనుమతించనుంది టిటిడి. ఇక రథసప్తమి ఏర్పాట్లును చీఫ్‌ ‌విజిలెన్స్ ఆఫీసర్‌ ‌గోపీనాథ్‌ ‌జెట్టి, అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పరిశీలించారు.

Leave a Reply