Take a fresh look at your lifestyle.

సంక్షేమం పేరుతో అభివృద్దిని విస్మరించారు

గుంతలను పూడ్చే పని చేపట్టిన పలువురు నేతలు
పార్టీ పిలుపుతో పలు జిల్లాల్లో టిడిపి నేతల నిరసనలు
రోడ్లు అధ్వాన్నంపై మండిపడ్డ మాజీ మంత్రి ప్రత్తిపాటి

విజయవాడ,జూలై 24 : రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెదేపా నాయకులు రోడ్ల అధ్వాన్న పరిస్థితులపై ఆందోళనకు దిగారు. నేతలంతా రంగంలోకి దిగి గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టారు. పలుచోట్ల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో వేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడా రోడ్లపై రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్లు ప్రయాణానికి వీలు లేకుండా తయారయ్యాయి. సంక్షేమం పేరిట అభివృద్ధిని విస్మరించా రన్నారు. గతంలో బిల్లులు చెల్లించకపోవడంతో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదని ప్రత్తిపాటి అన్నారు. బిల్లులు చెల్లిస్తే ఈ ప్రభుత్వం ద నమ్మకం ఏర్పడుతుందన్నారు. సంక్షేమం పేరుతో ప్రభుత్వం సంక్షోభం సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు డొల్లతనంగా ఉన్నాయని.. సంక్షేమం కంటే ప్రజలపై వేసే పన్ను భారమే ఎక్కువగా ఉందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. రహదారులు స్వచ్ఛందంగా మరమ్మతులు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను దెందులూరు పోలీసులు అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం బాపిరాజుగూడెంలో రహదారులపై ఉన్న గోతులను శనివారం తన అనుచరులతో కలిసి పూడ్చారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెదేపా నాయకులు ఏలూరు-చింతలపూడి రోడ్డులో బాపిరాజుగూడెం పరిధిలోని రామచంద్రాపురంలో గోతులు పూడ్చే చర్యలు చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకొని గోతులు పూడ్చడానికి అనుమతులు లేవంటూ అడ్డుకున్నారు. అనంతరం అక్కడ నుంచి కొయ్యలగూడెంలో జరిగే ఆందోళన కార్యక్రమానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. రహదారులపై గోతులు ప్రాణాంతకంగా మారాయన్నారు. ప్రజలు తమ ప్రాణాలు చేతబట్టి ప్రయాణించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని, దానిని మేల్కొల్పేందుకే రహదారులపై గోతులు పూడ్చే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలలో బొప్పన సుధాకర్‌, ‌మాగంటి నారాయణ ప్రసాద్‌, ‌తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని అల్లూరు గ్రామంలో రహదారుల పరిస్థితిపై తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌ ‌రావు, విజయవాడ పార్లమెంటరీ తెదేపా ఇంఛార్జీ నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, గ్దదె రామ్మోహన్‌ ‌రావు, తదితరులను అడ్డుకోవడానికి భారీగా వైకాపా కార్యకర్తలు తరలివచ్చారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నందిగామ గ్రాణ సీఐ నాగేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు తెదేపా నాయకులను మండలంలోని జుజ్జూరు గ్రామంలో అరెస్టు చేశారు. ఈ మేరకు దేవినేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. వైకాపా నాయకులు దోచు కోవడం తప్ప అభివృద్ధి చేయలేక పోతున్నారంటూ ఎద్దేవా చేశారు. అరెస్టు చేసిన నాయకులను చందర్లపాడు పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీలు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఇదిలావుంటే కర్నూలు జిల్లాలోని సంజామల మండలం పేరుసోములలో టీడీపీ నేతల నిరసనకు దిగారు. దెబ్బతిన్న రోడ్లను జేసిబీ, ట్రాక్టర్లతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్‌ ‌రెడ్డి మట్టి తోలించారు. బనగానప్లలె నియోజకవర్గంలో రివర్స్ ‌టెండరింగ్‌ ‌జరగడం లేదని బిసి జనార్ధన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. స్టేటస్‌ ‌కోసం విజయ్‌ ‌మాల్యా అప్పులు చేసి దేశం విడిచి పరారయ్యారని చెప్పారు. అప్పుల గురించి ప్రజలు ప్రశ్నిస్తే వైసీపీ నేతలకు కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు. చిత్తూరుజిల్లాలోనూ టిడిపి నిరసలకుదిగింది గుడిపాల మండలం బొమ్మ సముద్రం వద్ద రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయంటూ వరి నాట్లు వేసి టీడీపీశ్రేణులు నిరసన తెలిపాయి. జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు వర్షానికి గుంతల మయమై చెరువులను తలపిస్తున్నాయి. ఈ నిరసన కార్యక్రమం ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానిల ఆధ్వర్యంలో జరిగింది.

Leave a Reply