Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో.. గ్రీన్‌ ‌కారిడార్లుగా రోడ్ల అభివృద్ధి

రూ.13,169 కోట్లతో 766 కిలోటర్ల మేర రహదారుల అభివృద్ధి
పలు రోడ్లను జాతికి అంకితం చేసిన నితిన్‌ ‌గడ్కరీ
కొత్తగా పలురోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన

రాష్ట్రంలో పలు రోడ్లను గ్రీన్‌ ‌కారిడార్‌గా నిర్మిస్తున్నామని కేంద్రమంత్రి న ఇతిన్‌ ‌గడ్కరీ అన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులకు కేంద్ర నితిన్‌ ‌గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.13,169 కోట్లతో 766 కిలోటర్ల మేర రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా చేపట్టిన 14 రహదారుల్లో 6 ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా జాతికి అంకితం చేయడంతోపాటు మరో 8 నూతన రహదారులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వీకే సింగ్‌, ‌కిషన్‌  ‌రెడ్డి,రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వరంగల్‌లోని ఆరేపల్లి వరకు నిర్మించిన జాతీయ రహదారి 163ను ప్రారంభించారు. దీంతోపాటు సూర్యాపేట-నల్లగొండ జిల్లాల్లో నిర్మించిన రోడ్లు, వికారాబాద్‌-‌నారాయణ్‌పేట జిల్లాల్లో, హైదరాబాద్‌ ఔటర్‌ ‌రింగ్‌రోడ్డు నుంచి మెదక్‌ ‌రూటును, ఆత్మకూర్‌-‌పస్రా సెక్షన్‌లో 34 కి.. మేర నిర్మించిన రోడ్డు, మహదేవ్‌పూర్‌-‌భూపాలపల్లి సెక్షన్‌లో కొత్తగా నిర్మించిన రోడ్లను జాతికి అంకితం చేశారు. అదేవిధంగా సూర్యాపేట-ఖమ్మం, మంచిర్యాల-రేప్లలెవాడ, రామ్సన్‌ప్లలె-మంగళూరు, కంది-రామ్సన్‌ప్లలెతోపాటు మరికొన్ని రహదారుల పనులకు శంకుస్థాన చేశారు.

- Advertisement -

నర్సాపూర్‌- ‌బోధన్‌ ‌జాతీయ
రహదారిని కూడా గడ్కరీ ప్రారంభించారు. వీటిలో 6 జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు. మరో 8 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 370 కిలోటర్ల విస్తీర్ణంలో 3 వేల 717 కోట్లు విలువైన ఆరు ప్రాజెక్టులను కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ జాతీకి  అంకితం చేసారు.భారత్‌ ‌మాల పరియోజన కింద, దేశవ్యాప్తంగా 35 వేల కిలోటర్ల జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నారు.  ఇందులో 1400 కిలోటర్ల జాతీయ రహదారులను రాష్ట్రంలో భారత్‌ ‌మాల పరియోజనంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. అదనంగా, భారత్‌ ‌మాల సెకండ్‌ ‌ఫేస్‌  ‌కింద 750 కిలోటర్ల ఎక్స్ ‌ప్రెస్‌వేలను కూడా డెవలప్‌ ‌చేయనున్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు 2014 మే నెలకి ముందు ఉన్న 2 వేల 511 కి. నుంచి ఇప్పుడు 3 వేల 910 కిలో టర్లకు పెరిగింది. అనంతరం గడ్కరీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగును సీఎం కేసీఆర్‌ ‌ప్రోత్సహించడంపై సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇంధనం తయారీ పెంచడంపై దృష్టిసారించాలని అన్నారు. దేశంలో పెట్రోలియం కోసం రూ.8 లక్షల కోట్లు ఖర్చుచేస్తున్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు.

రూ.13,169 కోట్ల నిధులతో 766 కి.ల నేషనల్‌ ‌హైవేలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో రోడ్లు అభివృద్ధి చెందడం వల్ల రైతులు కూడా తమ పంట ఉత్పత్తులను రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చన్నారు. రోడ్ల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని అన్నారు. భారత్‌ ‌మాల ప్రాజెక్టు ఫేజ్‌ -1 ‌కింద 1076 కి.లకి రూ. 24 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా భూమిని సకరించలేదన్నారు. తెలంగాణలో నేషనల్‌ ‌హైవేలను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా భూ సేకరణ పూర్తిచేయాలన్నారు.  ఆధ్యాత్మిక కేంద్రం యాదాద్రితో పాటు టూరిజం సిటీ వరంగల్‌ ‌కు పూర్తి సీసీ 4 లైన్‌ ‌రోడ్‌ ‌నిర్మాణం అవుతుందన్నారు.  దీనివల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో నిర్మాణం అవుతున్న నేషనల్‌ ‌హైవేల వల్ల అన్ని అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

Leave a Reply