Take a fresh look at your lifestyle.

జనాభాకు అనుగుణంగా హైదరాబాద్‌ అభివృద్ధి

  • ట్రాఫిక్‌ ‌నియంత్రణకు ఫ్లై ఓవర్లు, రోడ్ల వెడల్పు : మంత్రి కెటిఆర్‌
  • ‌రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  • ఇందిరాపార్కు వద్ద ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన

జనాభాతో విస్తరిస్తున్న హైదరాబాద్‌ ‌నగరంలో ట్రాఫిక్‌ ‌చిక్కులు లేకుండా చేయడంతో పాటు, సుందర నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్‌ అద్భుత నగరంగా మారుతోందన్నారు. లాక్‌డౌన్‌తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎం‌సీలో నాలుగురెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ ‌వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ ‌భూమిపూజ చేశారు. ఇందిరాపార్క్ ‌నుంచి వీఎస్టీ వరకు వంతెన నిర్మాణానికి ఇందిరాపార్కు వద్ద శంకుస్థాపన చేశారు. ఎస్సార్‌డీపీలో భాగంగా రెండు వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు.

రూ.350 కోట్లతో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు ఎలివేటెడ్‌ ‌స్టీల్‌ ‌బ్రిడ్జి, రెండో దశలో రూ.76 కోట్లతో రాంనగర్‌ ‌నుంచి బాగ్‌లింగపల్లి వరకు మూడు లేన్ల వంతెన నిర్మిస్తామని తెలిపారు. రూ.6 వేల కోట్లతో ఎస్సార్‌డీపీ పనులు చేస్తున్నామన్నారు. జీహెచ్‌ఎం‌సీలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైరదాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తిచేస్తామని చెప్పారు. రూ.5 వేల కోట్లతో స్కైవేల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అంబర్‌పేట ఫ్లై ఓవర్‌ ‌నిర్మాణం త్వరలో పూర్తిచేస్తామన్నారు. 18 కి.. చొప్పున రెండు ఎలివేటెడ్‌ ‌కారిడార్లు ప్రతిపాదించామని తెలిపారు. రక్షణ రంగ భూములు ఇచ్చేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృషిచేయాలన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో ట్రాఫిక్‌ ‌సమస్య తగ్గించేందుకే వివిధ ప్రాజెక్టుల రూపంలో పనులు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌ ‌నగరంలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. కోవిడ్‌ ‌కట్టడిలో జీహెచ్‌ఎం‌సి సిబ్బంది బాగా పనిచేశారని మంత్రి కితాబు ఇచ్చారు. వారికి ప్రభుత్వం మూడు నెలలు ఇన్సెంటివ్‌ ఇచ్చిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ ‌బొంతు రాంమ్మోహన్‌, ‌పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి : కిషన్‌రెడ్డి
ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్‌ ‌ట్రాఫిక్‌ ‌సమస్య చాలా కాలం నుంచి ఉందని కేంద్ర •ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అప్పటినుండి ఇక్కడ ఫ్లై ఓవర్‌ ‌రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గతంలో భారీగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్డు ఒకటి.. ఫ్లై  ఓవర్‌తో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోతాయని ఆకాంక్షించారు. హైదరాబాద్‌ ‌నగరంలో జన సాంద్రత పెరిగి చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రోడ్లు, ఫ్లై ఓవర్‌ ‌చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. నగరంలోకి పెట్టుబడిదారులు మరింత మంది రావాలి అంటే ట్రాఫిక్‌ ‌సమస్య లేకుండా చూడాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా సహకరించుకోవాలని ఆకాంక్షించారు.

 

Leave a Reply

error: Content is protected !!