Take a fresh look at your lifestyle.

బిజెపి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం

  • అభివృద్ధికి కేంద్రం చేయూత
  • వరంగల్‌ ‌పట్టణాభివృద్దికి ప్రత్యేకంగా నిధులు
  • కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి
  • హాలియా సమావేశంతోనే కొరోనా వ్యాప్తి ..:విజయశాంతి

తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అధిక నిధులిచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్‌ ‌మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..వరంగల్‌ అభివృద్ధికి సైతం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. వరంగల్‌ అన్ని విధాలుగా అభివృద్ధి కావాలంటే.. బీజేపీ మేయర్‌ ‌గెలవాలన్నారు. సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వం చేతకానితనం వల్లే.. వొచ్చిన పీవోహెచ్‌ ‌పరిశ్రమ నిర్మాణం జరగలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. నగరం రూపురేఖలు మారాలంటే విమానాశ్రయం రావాలన్నారు. వరంగల్‌కు కేసీఆర్‌ ఏం ‌చేశారో చెప్పాలని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. విమానాశ్రాయానికి భూముల కేటాయింపు జరగలేదన్నారు. ఈ విషయంలో సిఎం కెసిఆర్‌ ‌దోషి అన్నారు. అన్ని పథకాల్లో కేంద్రం వాటా ఉందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అన్నింటిని దాచి అబద్ధాలు చెబుతుందన్నారు. వరగంల్‌ అభివృద్ధికి బిజెపి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఎన్నికల్లో గెలవడానికి సీఎం కేసీఆర్‌ ‌ప్రజలను గాక డబ్బులను నమ్ముకున్నారని కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న కిషన్‌ ‌రెడ్డి.. కేసీఆర్‌ ‌సర్కార్‌పై విమర్శలకు దిగారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం చేతాగాని తనం వల్లే వరంగల్‌కు వొచ్చిన పివోహెచ్‌ ‌పరిశ్రమ నిర్మాణం జరగలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం అత్యధిక నిధులు వరంగల్‌ అభివృద్ధికే కేటాయించిందని తెలిపారు. బీజేపీ వరంగల్‌ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఎలక్షన్లలో పంచడానికి కేసీఆర్‌ ‌దగ్గర డబ్బులున్నాయి కానీ వరంగల్‌ అభివృద్ధికి మాత్రం నిధులు లేవట. అవినీతి డబ్బుతో టీఆరెస్‌ ‌గెలవాలని అనుకుంటున్నది. తండ్రీ కొడుకుల ప్రభుత్వం వరంగల్‌ ‌ప్రజలను మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తున్నది. అవినీతిని అరికట్టాలన్నా, వరంగల్‌ను అన్ని విధాలుగా డెవలప్‌ ‌చేయాలన్నా బీజేపీ మేయర్‌ ‌గెలవాలి. వరంగల్‌ ‌రూపురేఖలు మారాలంటే ఇక్కడకు విమానాశ్రయం రావాలి. గత ఐదేళ్లుగా ఎయిర్‌ ‌పోర్ట్‌కు భూమి కేటాయించకుండా, రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయం నిర్మాణాన్ని అడ్డుకుంటున్నది. ఎయిర్‌ ‌పోర్ట్ ‌స్థలం చుట్టూ భూములు కొనుగోలు చేసిన టీఆర్‌ఎస్‌ ‌నాయకులు అడ్డుకుంటున్నారు.

వరంగల్‌కు కేసీఆర్‌ ఏం ‌చేశాడో చెప్పాలి? కనీసం రింగ్‌ ‌రోడ్డు కూడా వేయలేదు. వరంగల్‌ ‌ప్రజలను వోట్లు అడిగే హక్కు టిఆర్‌ఎస్‌కు లేదని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా కొరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. దయచేసి అందరూ జాగ్రత్తలు పాటించండి..టీకాలు వేయించుకోవాలన్నారు. వరంగల్‌ ‌లో వి•డియాతో మాట్లాడిన విజయశాంతి.. కొరోనా విజృభిస్తున్నా కూడా ఎన్నికలు ప్రచారాలు, సభలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు ప్రజల కన్నా ఎన్నికలే ముఖ్యమా అని ప్రశ్నించారు. హాలియా సభతో ఎంతో మందికి కొరోనా వొచ్చిందన్నారు. తాను ప్రత్యక్ష ప్రచారానికి దూరంగా ఉంటూ, సోషల్‌ ‌వి•డియా వేదికగా ప్రచారం చేయాలనుకుంటున్నానని తెలిపారు. వరదలతో వరంగల్‌ ‌ప్రజలు ఎంతో నష్ట పోయారని, సీఎం కేసీఆర్‌ ఎక్కడ అయినా కుర్చీ వేసుకొని కూర్చుంట అంటారు కదా.. మరి వరంగల్‌ ‌లో ఎన్నిసార్లు కూర్చున్నారని ప్రశ్నించారు.  ఆయనకు కావాల్సింది ఓటుకు నోటు, కాంట్రాక్టులు, కమిషన్లు అని ఆరోపించారు. వరంగల్‌ ‌లో 3 వేల డబల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు ఇస్తా అన్నారు..3 వేలు కాదు కదా కనీసం 3వందల ఇల్లు కూడా ఎవరికీ ఇవ్వలేదన్నారు విజయశాంతి. టీఆర్‌ఎస్‌ ‌నేతల పని తక్కువ ప్రచారాలు ఎక్కువ అని అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌తప్పుడు హావి•లు, డబ్బు, మద్యంతోనే గెలుస్తున్నాడని తెలిపారు. ఇచ్చిన హావి•ల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ‌కు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమేనని విజయశాంతి అన్నారు. బీజేపీ గెలుపుతోనే వరంగల్‌ అభివృద్ధి చెందుతుందన్నారు.

Leave a Reply