Take a fresh look at your lifestyle.

కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి

  • మోడీకి పేరొస్తుందని ఆయుష్మాన్‌ ‌భారత్‌ అమలు చేయడం లేదు
  • కొరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది తప్ప తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శించారు. సిదిపేట మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో సాగిన రోడ్‌ ‌షో ద్వారా బండి సంజయ్‌ ‌పట్టణంలో ప్రచారం నిర్వహించారు. బీజేపీ శ్రేణుల భారీ వాహన శ్రేణితో రోడ్‌ ‌షో రూరల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌చౌరస్తా నుండి నర్సాపూర్‌ ‌చౌరస్తా వరకు సాగింది. అనంతరం బండి సంజయ్‌ ‌మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై ప్రజలు ఎంత విసుగు చెందరో తెలుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని తెలిపారు. సిద్దిపేటలో ఎలక్షన్లు వచ్చాయని రోడ్లు తవ్వడం రాత్రికి రాత్రే రోడ్లు వేయడం చూస్తూ ప్రజలు నవ్వుతూన్నారని ఎద్దేవా చేశారు. సిద్దిపేటకు ఆర్థిక సంగం నిధుల కింద 30 కోట్ల 40 లక్షలు, ప్రధానమంత్రి నివాస్‌ ‌యోజన పతకం క్రింద 2,799 ఇండ్లకు 138 కోట్ల 40 లక్షల రూ.కేంద్రం ఇచ్చిందని వివరించారు. 6768 మంది వీధి వ్యాపారులకు 7 కోట్ల రూ. కేంద్రం రుణ సదుపాయం చేసిందని చెప్పారు. సామూహిక మరుగుదొడ్లుకు డబ్బులు ఇస్తా అంటే తీసుకోవడం లేదని ఎందుకంటే వాటిలో కమిషన్లు రావు కాబట్టి తీసుకోవడం లేదుని విమర్శించారు.

కొత్త రేషన్‌ ‌కార్డులు ఇప్పటి వరకు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పారు. సిద్దిపేటలో కోమటి చెరువు వలన ఒక్క ఎకరానికి అయిన నీరు ఇచ్చారా..నిరుద్యోగులకు ఏమైనా చేశారా ? అని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రాక ముందు అభివృద్ధి కాలేదన్న మంత్రి హరీష్‌ ‌రావు అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నది కూడా మీమామా కేసీఆరే కదా మరి ఎందుకు అభివృద్ధి జరగలేదని నిలదీశారు. కేవలం కోమటి చెరువు, ఓపెన్‌ ఆడిటోరియం అని కోట్లాది రూపాయలు మింగేసి నారని ఆరోపించారు. సిద్దిపేటలో అమృత్‌ ‌పథకం కింద వచ్చిన నిధులతో కాకుండా మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని అన్నారు. సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునే పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే అని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కొరోనా విలయతాండవం చేస్తున్న, కార్మికుల చనిపోయినా, ఉద్యోగుల చనిపోయినా జర్నలిస్టులు చనిపోయిన కేసీఆర్‌ అదేం పట్టక ఫాం హౌస్‌లో జల్సా చేస్తున్నారని ఆరోపించారు. కొరోన విషయంలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని వాపోయారు. ప్రభుత్వం శవాల మీద రాజకీయాలు చేస్తున్నదని, ఒక యువకుడు కొరోనాను ఆర్యోగ శ్రీలో చేర్చండి లేదా కేసీఆర్‌ ‌ను గాంధీ లో చేర్చండి అని సోషల్‌ ‌మీడియాలో ఒక యువకుడు ఆవేదన తో పెట్టిన పోస్టును గుర్తు చేశారు. మోడీకి పేరు వొస్తుందని ఆయుష్మాన్‌ ‌భారత్‌ అమలు చేయడం లేదని అన్నారు. కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కొరోనా పేషంట్ల కోసం ఎక్కువ మొత్తంలో బెడ్స్, ‌వెంటిలేటర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సిద్దిపేట ప్రజలు విజ్ఞతతో అన్ని విషయాలు ఆలోచించి బీజేపీకే పట్టం కట్టాలని కోరారు. సిద్దిపేటలో ఏ పార్టీ నుండి గెలిచినా అందరూ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ లోకి వెళ్తారని అందుకే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బండి సంజయ్‌ ‌ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు రామచంద్ర రెడ్డి, బాలేష్‌ ‌గౌడ్‌, ‌సురేష్‌ ‌గౌడ్‌, ‌మోహన్‌ ‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply