Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌ ‌పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం

  • లాయర్ల సంక్షేమానికి వందకోట్లు కేటాయించాం
  • రాంచంద్రరావు లాయర్లకు చేసిందేమిటి
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిని గెలిపించాలి.
  • రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌ ‌రావు. సబితా ఇంద్రారెడ్డి.

తాండూరు, మార్చి 3(ప్రజాతంత్ర విలేఖరి) : దేశంలో అడ్వకేట్లకు రూ.100 కోట్లతో వెల్ఫేర్‌ ‌ఫండ్‌ ఏర్పాటు aచేసిన ఏకైక రాష్ట్ర తెలంగాణ మాత్రమేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అమోఘమన్నారు. ప్రభుత్వం కరోనా సమయంలో రూ.25 కోట్లు సాయం అందించిందని, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీగా ఉండడం బీజేపీ నేత రాంచందర్‌రావుకు ఇష్టం లేదని.. దీంతో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు తిరస్కరించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌ – ‌రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ ‌పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా తాండూరు ఆర్యవైశ్య భవన్‌లో టీఆర్‌ఎస్‌ ‌సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు విద్యాశాఖ మంత్రి పబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంచంద్‌రావు ఆరేళ్లలో అడ్వకేట్లకు చేసిన సేవ ఏంటో చెప్పాలన్నారు.

తెలంగాణతో తాండూరు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడిందన్నారు. న్యాయవాదులు తమ ఓటును వాణీదేవికి వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎం‌పీ, పీఎంసీలు ఉద్యమంలో, రాష్ట్రాభివృద్ధిలో సహకారం అందిం చారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మరోసారి సహకరించాలన్నారు. కరోనాతో అనేక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, పిల్లల భవిష్యత్‌ను ఆలోచించి ఆరో తరగతి నుంచి విద్యాసంస్థలు ప్రారంభించామని అన్నారు. లక్ష మంది పట్టభద్రులను తయారు చేసిన మంచి అభ్యర్థి వాణీదేవికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. జూనియర్‌ ‌కాలేజీ యాజమాన్యం ఉద్యమంలో ఉన్న వారు సహకరించాలన్నారు. కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని, వారికి బుద్ధి చెప్పేలా వాణీదేవికి ఓటు వేయాలని కోరారు.

మహిళా పట్టభద్రులంతా ఎన్నికల్లో వాణీదేవికే ఓటు వేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. కరోనాతో విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, ప్రైవేటు సంస్థల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విద్యాలయాలను తెరవాలని సీఎం చెప్పారన్నారు. చిన్న చిన్న ప్రైవేటు విద్యా సంస్థలు పిల్లలకు విద్యతో పాటు ఉపాధి కల్పించే వాటిగా సీఎం భావిస్తున్నారన్నారు. ఈ కారణం తోనే ప్రభుత్వం పాఠశాల వాహనాలకు రద్దు చేయడం జరిగిందన్నారు. విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన వాణీదేవికి ఓటు వేసి గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా తాను విద్యా వ్యవస్థ లోనే ఉన్నానని, కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థలు ఉన్నట్లు తెలిపారు.

ప్రైవేట్‌ ‌పాఠశాలలు ప్రైవేటు కళాశాలలు నడపడం ఎంత కష్టమో తనకు తెలుసని నిరుద్యోగులకు, నిరుద్యోగ యువతకు కౌన్సెలింగ్‌ ఇవ్వగల సామర్థ్యం తనకు ఉన్నదని, యూనివర్సిటీలు, పాఠశాలలు, కళాశాలలలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయగలనని అన్నారు. పివి కూతురు అని కాకుండా సేవ చేసే గుణం కల దానిని దానిగా తనకు వోటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ ‌సభ్యులు డాక్టర్‌ ‌రంజిత్‌ ‌రెడ్డి మరియు మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ ‌రెడ్డి మరియు రాష్ట్ర విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్‌ ‌నాగేంద్ర గౌడ్‌ ‌మరియు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌రాష్ట్ర నాయకులు పర్యాద కృష్ణమూర్తి మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌స్వప్న పరిమళం, వైస్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌దీప నర్సింలు, మున్సిపల్‌ ‌కౌన్సిలర్లు, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్‌ ‌రాహుప్‌, ‌నాయకులు మురళి కృష్ణ గౌడ్‌, ‌కర్ణం పురుషోత్తం రావు, నియోజకవర్గంలోని ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. హరీష్‌ ‌రావు సబితా ఇంద్రా రెడ్డి చేవెళ్ల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply