Take a fresh look at your lifestyle.

కోవిడ్‌-19 ‌వ్యాక్సిన్‌ అభివృద్ధి మరియు తయారీ

పనిచేస్తున్న మూడు బృందాలతో సంభాషించిన  ప్రధానమంత్రి
కోవిడ్‌-19 ‌వ్యాక్సిన్‌ అభివృద్ధి మరియు తయారీపై పనిచేస్తున్న మూడు బృందాలతో ప్రధానమంత్రి సోమవారం దృశ్య మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఈ బృందాల్లో పూణేలోని జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ ‌లిమిటెడ్‌ ‌తో పాటు హైదరాబాద్‌ ‌లోని బయోలాజికల్‌ ఇ ‌లిమిటెడ్‌ ‌మరియు డాక్టర్‌ ‌రెడ్డీస్‌ ‌లాబొరేటరీస్‌ ‌లిమిటెడ్‌ ఉన్నాయి. కోవిడ్‌-19 అరికట్టడానికి అవసరమైన టీకా పరిష్కారాన్ని కనుగొనడానికి ఈ సంస్థలలోని శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి  ప్రశంసించారు.

వ్యాక్సిన్‌ అభివృద్ధికి వివిధ వేదికల సామర్థ్యాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చర్చించారు. నియంత్రణ పక్రియలు మరియు సంబంధిత విషయాలకు సంబంధించి కంపెనీలు తమ సూచనలు, ఆలోచనలను బయటకు తెలియజేయాలని ప్రధానమంత్రి కోరారు. వ్యాక్సిన్‌ ‌గురించి, దాని సమర్థత మొదలైన సంబంధిత విషయాల గురించి, సాధారణ ప్రజలకు, సాధారణ భాషలో తెలియజేయడానికి వీలుగా ఆయా కంపెనీలు అదనపు ప్రయత్నాలు చేయాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.

Leave a Reply