Take a fresh look at your lifestyle.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయం

  • కేంద్రం గెజిట్‌ ‌నోటిఫికేషన్‌
  • ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు చెక్‌
  • అన్ని అంశాలను చర్చించే బోర్డులపై నిర్ణయం
  • కేంద్ర జలశక్తి శాఖ జాయింట్‌ ‌సెక్రటరీ సంజయ్‌ అవస్థి వెల్లడి

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ నీటి వివాదాలకు చెక్‌ ‌పెట్టేందుకు కేంద్రం గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య కేటాయింపులకు అనుగుణంగా వాడుకునేలా చర్యలు తీసుకుంది. ఇటీవలి ఘటనల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్న తరువాతే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయించామని కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాల బోర్డుల పరిధి, నిర్వహణపై తాము విడుదల చేసిన గెజిట్‌పై కేంద్ర జలశక్తి అధికారులు వివరణ ఇచ్చారు.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్‌ ‌విడుదల చేశామని కేంద్ర జలశక్తి శాఖ జాయింట్‌ ‌సెక్రటరీ సంజయ్‌ అవస్థి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం అర్ధరాత్రి కేంద్రం గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. దీనిలో భాగంగా కేంద్ర జలశక్తి జాయింట్‌ ‌సెక్రటరీ సంజయ్‌ అవస్థి శుక్రవారం వి•డియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరగిందని, సెక్షన్‌ 84 ‌ప్రకారం అపెక్స్ ‌కౌన్సిల్‌ ఏర్పాటైందని తెలిపారు. దీనిలో భాగంగా 2016 సెప్టెంబర్‌లో తొలిసారి అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశమైందని, కాగా, అందులో కమిటీ సరైన నిర్ణయం తీసుకోలేక పోయిందన్నారు.  మరోసారి 2020 అక్టోబర్‌ 6‌న కమిటీ మళ్లీ సమావేశమైందన్నారు.

అయితే  2014 నుంచి రెండు బోర్డులపై కసరత్తు చేస్తున్నామన్నారు. కాగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించినట్లు వెల్లడించారు. గురువారం రాత్రి ఇచ్చిన గెజిట్‌ ‌నోటిఫికేషన్‌కు ముందు ఎంతో చర్చించామని, సీడబ్యూసీతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయానికి వొచ్చామని పేర్కొన్నారు. ఎంతో ఆలోచించిన తర్వాతే ప్రతి పదం, ప్రతి వాక్యం రాశామని, విభజన చట్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలు సమానంగా భరించాలని, నోటిఫికేషన్‌ ‌వొచ్చిన 60 రోజుల్లో రూ. 200 కోట్ల చొప్పున డిపాజిట్‌ ‌చేయాలని తెలిపారు. బోర్డుల నిర్వహణకు నిధులు, వనరుల కొరత రాకూడదని సూచించారు. ఏ ప్రాజెక్ట్ ఆమోదం పొందిందో.. ఏది ఆమోదం పొందలేదో నిర్వచించామన్నారు. మొదటి షెడ్యూల్‌లో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్ట్‌ల పేర్లు చేర్చామని, రెండో షెడ్యూల్‌లో కేఆర్‌ఎం‌బీ, జీఆర్‌ఎం‌బీ ఆధ్వర్యంలో ఉండే ప్రాజెక్ట్‌ల పేర్లు చేర్చామన్నారు. The turnover of the Australian gambling industry is more than twenty billion AUD per year; This number covers all traditional casinos, online fun and lotteries https://trello.com/c/hhbL6GAY/1-about-me if you are only concerned about the legality of Australian online casinos, please refer to regional and federal legislation or ask for advice from an authorised body.

ఈ ప్రాజెక్ట్‌ల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ ‌బలగాలను మోహరిస్తామన్నారు. మూడో షెడ్యూల్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయని ఆయన పేర్కొన్నారు.  తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆమోదం పొందిన ప్రాజెక్టులు.. పొందని ప్రాజెక్టుల వివరాలు ఇందులో పేర్కొన్నామని అన్నారు. షెడ్యూల్‌-3‌లో ఇప్పుడు ఉన్నట్లే రాష్ట్రాల పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

Leave a Reply