Take a fresh look at your lifestyle.

యూపి ఘటనలో 28 గంటలుగా నిర్బంధం

  • మోడీని ఉద్దేశిస్తూ ప్రియాంక ట్వీట్‌
  • ‌వేడుకలకు ఇది సమయం కాదంటూ అఖిలేశ్‌ ‌ట్వీట్‌

‌లఖింపూర్‌ ‌ఖేరి హింసాత్మక ఘటనలో మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన తనను గత 28 గంటలుగా నిర్బంధంలో ఉంచినట్టు కాంగ్రెస్‌ ‌నేత ప్రియాంక గాంధీ మంగళవారంనాడు తెలిపారు. ఎలాంటి ఉత్తర్వులు కానీ, ఎఫ్‌ఐఆర్‌ ‌కానీ లేకుండా తనను నిర్బంధించినట్టు ఆమె తెలిపారు. నలుగురు రైతులతో సహా 8 మంది మృతికి కారణమైన నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈమేరకు ప్రధాని మోదీని సంబోధిస్తూ ప్రియాంక గాంధీ ఓ ట్వీట్‌ ‌చేశారు. నరేంద్ర మోదీజీ…వి• ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు, ఎఫ్‌ఐఆర్‌ ‌లేకుండా 28 గంటలుగా నన్ను నిర్బంధంలో ఉంచింది. కానీ, అన్నదాతలను అణిచివేతే వ్యక్తులను మాత్రం ఇంతవరకూ అరెస్టు చేయలేదని అంటూ ప్రియాంక ట్వీట్‌ ‌చేశారు. నినాదాలు చేస్తూ ఒక క్రమపద్ధతిలో మార్చింగ్‌ ‌చేస్తున్న రైతులపై ఎస్‌వీయూ దూసుకుపోయిన వీడియోను కూడా ప్రియాంక షేర్‌ ‌చేశారు.

ఇదిలావుంటే లఖింపూర్‌ ‌కేరి హింసాత్మక ఘటనతో ఉత్తరప్రదేశ్‌ ‌విషాదంలో మునిగిపోయిందని, ఇది సెలబ్రేషన్లు జరుపుకునే సమయం కాదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ ‌యాదవ్‌ అన్నారు. షెడ్యూల్‌ ‌ప్రకారం మంగళవారంనాడు లక్నోలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ మంగళవారంనాడు ప్రారంభించాల్సి ఉంది. ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌తాజా ట్వీట్‌ ‌చేశారు. రైతులను కోల్పోయిన విషాదంలో యూపీ ఉందని, సెలబ్రేషన్లు జరుపుకునేందుకు ఇది సమయం కాదని ఆయన అన్నారు. ప్రధాని మోదీ లక్నోలో జరిగే ఆజాదీ 75-న్యూ అర్బన్‌ ఇం‌డియా ఎక్స్‌పోలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో 74 అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపన చేయనున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌కేంద్ర మంత్రి హర్దీప్‌ ‌సింగ్‌ ‌పురి, యూపీ గవర్నర్‌ ఆనంది బెన్‌ ‌పటేల్‌, ‌యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌హాజరుకానున్నారు.

Leave a Reply