Take a fresh look at your lifestyle.

నూతన సచివాలయం తన ఛాంబర్‌ ‌లో ఆసీనులైన సందర్భంగా…. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు సంతకాలు చేసిన ఫైళ్ళ వివరాలు :

1. దళితబంధు పథకం 2023-24 సంవత్సరంలో అమలుకు సంబంధించిన ఫైలు మీద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్‌ ‌మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజక వర్గానికి 1100 లబ్ధిదారుల చొప్పున దళిత బంధు పథకాన్ని వర్తింపచేయాలనే ఫైలుమీద సిఎం కేసీఆర్‌ ‌సంతకం చేశారు.

2. పోడుభూముల పట్టాల పంపిణీ కి సంబంధించిన ఫైలుమీద సిఎం కేసీఆర్‌ ‌రెండో సంతకం చేశారు. మే నెల నుంచి జిల్లాలవారిగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. తద్వారా 1 లక్షా 35 వేల మంది లబ్ధిదారులకు దాదాపు 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు అందచేయనున్నారు . ఇందుకు సంబంధించిన ఫైలు మీద సిఎం కేసీఆర్‌ ‌సంతకం చేశారు.

3. సిఎంఆర్‌ఎఫ్‌ ‌నిధులు లబ్ధిదారులకు సంబంధించిన ఫైలు మీద సిఎం కేసీఆర్‌ ‌సంతకం చేశారు.

4. గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అందించే…కేసీఆర్‌ ‌న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌కు సంబంధించిన ఫైలు మీద సిఎం కేసీఆర్‌ ‌సంతకంచేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేసీఆర్‌ ‌న్యూట్రిషన్‌ ‌కిట్స్ ‌పంపిణీ జరుగనున్నది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 13.08 లక్షల కిట్స్ ‌పంపిణీ చేయాలని లక్ష్యం గా ఎంచుకున్న నేపథ్యంలో..6.84 లక్షల మంది గర్భిణులు లబ్ధి పొందనున్నారు. కాగా

ఒక్కో కేసీఆర్‌ ‌న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌విలువ రెండు వేల రూపాయలు. ఇందుకు గాను ప్రభుత్వం మొత్తం రూ. 277 కోట్లు ఖర్చు చేయనున్నది.

5. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ ‌కు సంబంధించిన ఫైలుమీద సిఎం కేసీఆర్‌ ‌సంతకం చేశారు.

6. పాలమూరు లిఫ్టు ఇరిగేషన్‌ ‌కు సంబంధించిన ఫైలు మీద సిఎం కేసీఆర్‌ ‌సంతకం చేశారు.

Leave a Reply