భరతమాత స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయుల చెర నుండి భారతదేశాన్ని సైనిక రీతిన పోరాడి స్వతంత్య్రం సంపా దించాలనే ఉద్దేశంతో భారతీ యులను సైనికులుగా తీర్చిదిద్దిన స్వాంతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన జన్మదినాన్ని ‘దేశ్ ప్రేమ్ దివస్’గా జరుపుకుంటాము. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒరిస్సాలోని కటక్‌లో జన్మించాడు. తండ్రి జానకీ నాథ్ బోస్. తల్లి ప్రభావతీ దేవి బోస్, చిన్న నాటి నుంచే విద్యారంగంలో రాణించిన నేతాజీ రామకష్ణ పరమహంస, స్వామి వివేకానందల ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. సన్యాసం తీసుకోడానికి కూడా తీర్మానించారు. ‘‘మానవసేవే మాధవసేవ’’ అనే నినాదంతో పాటు రామకృష్ణ ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు.1919వ సంవత్సరం తత్త్వ పాఠ్యాంశంలో నేతాజీ డిగ్రీని సంపాదించారు. తర్వాత ఇంగ్లాండ్ బయలుదేరిన సమయంలో పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌లో జలియన్ వాలా బాగ్ సంఘటన చోటుచేసుకుంది. 1919న ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ఐసిఎస్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. కలెక్టర్ అయ్యే అవకాశం వున్నప్పటికీ బ్రిటిష్ వారి కింద పని చేయడం ఇష్టం లేక అందులో చేరలేదు. స్వాతంత్రసమరంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. అయినప్పటికీ కాంగ్రెస్ వారి సత్యాగ్రహ ఉద్యమం విధానం నచ్చక కాంగ్రెస్ నుండి బయటకి వచ్చారు. అనేక దేశాలు తిరిగి విదేశాలలో ఉన్న భారతీయులను రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ బంధించిన భారతీయ సైనికులను అందరినీ ఏకం చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ‘నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’’ అని తన సైన్యాన్ని ఉత్సాహపరిచాడు. చలో ఢిల్లీ నినాదంతో సైన్యాన్ని ముందుకు నడిపాడు. ఎమిలీ, బోస్‌ల వివాహం డిసెంబర్ 27, 1937న ఆస్ట్రియాలోని బాడ్‌గస్టైన్‌లో జరిగింది. అయితే తమ వివాహాన్ని రహస్యంగా ఉంచాలని వారు నిర్ణయించుకున్నారు. వారికి ఒక కూతురు జన్మించింది. కూతురు పేరు అనితా బోస్. తరువాత క్రమంలో మహాత్మా గాంధీతో సిద్ధాంతపరమైన విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్‌ను వీడి, భారత దేశ స్వాతంత్య్రం అత్యంత ప్రాధాన్యత గల అంశమని బ్రిటిష్ పాలకులను తరిమి వేయడానికి జపాన్ వాళ్ళ సహాయం తీసుకోవాలని భావించి రహస్యంగా జర్మనీకి వెళ్ళి, అక్కడ నుండి జపాన్ వెళ్ళి 1942లో భారతీయులతో ఒక సైన్యాన్ని స్టాపించాడు.‘‘ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ’ని స్థాపించి తన పోరాటాన్ని కొనసాగించారు. జపాన్ సైన్యంతో కలిసి తన సైన్యంతో దాదాపు మూడు సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించి నప్పటికీ, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.
నెరుపటి ఆనంద్,
ఉపాధాయులు, టేకుర్తి
9989048428