అమరావతి, జూలై 22 : మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో పథకాలు ఇచ్చారని ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. దేశంలో ఏ సీఎం ప్రోత్సహించని రీతిలో మహిళలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. పథకాలు, పదవుల్లోనూ మహిళలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యతిచ్చారని ప్రశంసించారు. మహిళల పుట్టుకనే చంద్రబాబు అవహేళన చేశారన్న డిప్యూటీ సీఎం.. మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతిచ్చారని ప్రశంసించారు.
మహిళా పక్షపాతిగా సీఎం జగన్ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. కాపునేస్తం సాయంతో 45 నుంచి 60 ఏళ్లు మహిళలు వాళ్ల కాళ్లద వాళ్లు నిలబడ గలుగుతారనే దృక్పధంతో సిఎం అడుగులు ముందుకు వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు తోడుగా చేయూత పథకంలో మల్టీ నేషనల్ కంపెనీలతో టై అప్ చేసే కార్యక్రమం చేపట్టారు. వాళ్లకు మరింత వ్యాపార అవకాశాలు మెరుగుపర్చాలన్న తపనతో రిలయన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, హిందుస్తాన్ లీవర్, అమూల్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం చేశారని అన్నారు.
ఈ పెద్ద కంపెనీలు చేయగా మిగిలిన వాళ్లందరికీ కూడా ఏటా రూ.15వేలు ఇస్తూ వెళితే వ్యాపార దృక్పథంతో అడుగులు వేసే పరిస్ధితి వస్తుంది. తద్వారా వారు ప్రణాళిక వేసుకోగలుగుతారు. వ్యాపారాలు చేసుకోవాలన్న ఆలోచన వారికి కలుగుతుంది. ఏ నెల్లో ఇస్తున్నాం అన్నది ముందుగానే చెప్తున్నాం, వారిలో భరోసాను కల్పిస్తున్నాం. ప్రభుత్వం మాట చెపితే కచ్చితంగా ఇస్తుందనే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, తద్వారా ఆర్థికంగా వారు ప్రణాళిక వేసుకోగలుగుతారని అన్నారు. ఇంతగా ఆలోచించే సిఎం గతంలో లేరని అన్నారు.