Take a fresh look at your lifestyle.

‌ప్రైవేట్‌ ఆసుపత్రులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి

ఏజన్సీ ప్రాంతంలో గిరిజన ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులలో డెంగ్యూ, మలేరియా టెస్టులు నిర్వహించుకొన్న వారికి సంబందిత ఆసుపత్రి డాక్టర్లు డెంగ్యూ వ్యాధి అని నిర్ధారణ చేస్తే నివేదికలు తెప్పించుకొని రిపోర్టులు సరియైనదా కాదా అని పరిశీలించి సంబందిత డెంగ్యూ టెస్టులు చేయించుకొన్న వ్యక్తులకు మరలా ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు నిర్వహించాలని వ్యాధి నిర్ధారణ కాక పోతే సంబందిత ప్రైవేటు ఆసుపత్రులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి గౌతమ్‌ ‌పొట్రో వైద్యాధికారులకు దిశ నిర్దేశం చేశారు .గురువారం ఐ.టి.డి.ఏ పి.ఓ చాంబర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డి.యం. హెచ్‌.ఓ ‌బాస్కర్‌ ‌నాయక్‌ ‌తో కలసి సంబందిత జిల్లా వైద్యాధికారులు పి.ఓ కోవిడ్‌ ‌కేసులు,ఐసోలేషన్‌ ‌సెంటర్స్లలో సదుపాయాలు,మలేరియా డెంగ్యూ వ్యాదులు తీసుకుంటున్న చర్యలపై పి.ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా పి.ఓ మాట్లాడుతూ వ్యాదులు కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించి శక్తివంచన లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని సంబందిత వైద్యాధికారులకు సూచించారు. కోవిడ్‌ ‌సెంటర్‌ ‌లో ఆయూష్‌ ‌స్టాప్‌ అవసరమైతే రాష్ట్ర బాల స్వస్థత సెంటర్‌ ‌సిబ్బందిని వినియోగించుకోవాలని భద్రాచలం ఏరియా తిలోని కోవిడ్‌ ‌సెంటర్‌ ‌లో అత్యవసర చికిత్సల కొరకు సిబ్బంది మరియు మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఎవరికైనా అత్యవసర చికిత్సలు అవసరమైతే వెంటనే చేసే విధంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు కోవీడ్‌ ‌టెస్టులు చేయించు కున్న వారికి నెగిటీవ్‌ అని నిర్ధారణ అయితే తప్పకుండా మలేరియా డెంగ్యూ టెస్టులు చేయాలని పోగ్రాం అధికారులు వారి పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ప్రతీరోజూ పర్యవేక్షించాలని డి, యం. హెచ్‌.ఓ ‌ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రతీ పి.హెచ్‌.‌సి లో కోవిడ్‌, ‌డెంగ్యూ,మలేరియా టెస్టులు ల్యాబ్‌ ‌టెక్నీషియన్‌ ‌లేనిచోట ఫార్మసిస్ట్ ‌తో గానీ హెల్త్ అసిస్టెంట్లతో గానీ చేయించాలని అన్నారు ఈకార ్యక్రమంలో డి.ఎం. హెచ్‌.ఓ ‌బాస్కర్‌,‌జిల్లా కేర్‌ ‌హెల్త్ ‌సెంటర్‌ ‌డాక్టర్‌ ‌ముక్కంటేశ్వరరావు, ఎడి. యం. హెచ్‌.ఓ ‌శ్రీనివాస్‌, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్‌ ‌యుగందర్‌, ‌డిప్యూటీ డి.యంహెచ్‌ .ఓలు డాక్టర్‌ ‌నాగేంద్రప్రసాద్‌, ‌బావశింగ్‌,‌పోగ్రాం అధికారులు సుకృత,చేతన,ప్రసాద్‌, ‌హెచ్‌.ఇ.ఓ ‌దర్గుయ్య మలేరియా నివారణ అధికారి వెంకటేశ్వర్లు,సంబందిత సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply