Take a fresh look at your lifestyle.

ఇళ్ళను కూల్చటం అమానుషం మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.‌ప్రవీణ్‌ ‌కుమార్‌

‌కొత్తగూడెం,ఆగస్టు 03 (ప్రజాతంత్ర ప్రతినిధి): ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరికీ సొంతింటి కల ఉంటుందని ఆ కలను కల్లలు చేస్తూ మేధార బస్తీలో ఉన్న షాపులు, ఇళ్లను కూల్చి వేయడం అమానుషమని మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌. ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మేధరబస్తీలో ఇటీవల ఇళ్లు, షాపులు కోల్పోయి పాత కొత్తగూడెంలోని పునరావాస కేంద్రంలో బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్న బాధితులను జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్‌, ‌పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నపళంగా మేధారబస్తీలో ఉన్న ఇళ్లను రాత్రికిరాత్రే కూల్చివేయడం దారుణమని అన్నారు. ప్రభుత్వం కల్పించిన పునరావాస కేంద్రంలో పరిస్థితులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాసం పేరుతో ప్రభుత్వ పాఠశాలలో వసతి సౌకర్యం కల్పించారని, కానీ ఎలాంటి సౌకర్యాలు లేక బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పేదల కోసం తన ప్రాణాలను సైతం అడ్డువేస్తానని నమ్మబలికిన స్థానిక ఎమ్మెల్యే వనమా అత్తకుపత్తకు లేకుండాపో యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియోజకవర్గ ప్రజలను కేవలం ఓటర్లు గానే చూస్తున్నారు తప్ప వారికి న్యాయం చేసేందుకు మాత్రం కాదని అన్నారు. పునరా వాస కేంద్రంలో ఉన్న బాధితులకు నేనున్నా అంటూ మాయమాటలు చెప్పి కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో ఉన్న తనకే జరిగిన ఘటన తెలుసుకుని అయ్యో పాపం అనిపించిందని, ఎప్పుడుడేప్పుడు ఇక్కడికి వద్దామా అనిపియించిందని, కానీ స్థానికంగా ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కి, ప్రజాప్రతినిధులకు తీరిక లేదా అని ప్రశ్నించారు. బాధితుల ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని  మొత్తం కలిపి 4 నుంచి 6 వేలు సంపాదించుకునే వాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారని అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్‌ ‌తక్షణమే పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాదితుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని, భోజన, వసతి సౌకర్యాలను పరిశీలించాలని సూచించారు.పాత కొత్తగూడెం లో పేదల కోసం కల్పించిన డబుల్‌ ‌బెడ్‌ ఇళ్లను తక్షణమే మేధారబస్తీ బాధితులకు కేటాయించాలని డిమాండ్‌ ‌చేశారు.ఈ నెల 8వ తేదీన బీఎస్పీ లో చేరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్‌, ‌రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌, ‌గంధం మల్లికార్జున రావు, ఇర్పా కామరాజు, ఈసం నర్సింహ రావు, బొంతు సత్యకిరణ్‌, ‌జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply