Take a fresh look at your lifestyle.

‌ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం ప్రజాతంత్ర

క్యాలెండర్‌ ఆవిష్కరణలో మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట, జనవరి 6, (ప్రజాతంత్ర ప్రతినిధి) : ప్రజల ఆకాంక్షలకు వేదికగా ప్రజాతంత్ర దినపత్రిక నిలుస్తున్నదని  రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, ఉద్యమ వార్తలను  అగ్రభాగాన ప్రజాతంత్ర ప్రచురించిందని గుర్తు చేశారు.  ప్రజాతంత్ర తెలుగు దినపత్రిక 2022 క్యాలెండర్‌ను మంత్రి జగదీష్‌రెడ్డి సూర్యాపేట తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో ముందుంటాయన్నారు.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు నిలుస్తాయని వెల్లడించారు. పత్రికలు క్యాలెండర్లు, డైరీలు ప్రచురించడం పత్రిక సంప్రదాయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ ‌చైర్మన్‌ ‌గోపగాని వెంకట నారాయణ, ఉప్పల్‌ ఆనంద్‌, ‌దిలీప్‌ ‌రెడ్డి, బోల్క వెంకట్‌, ‌వెంకన్న, లక్ష్మణ్‌, ‌ప్రజాతంత్ర జిల్లా ప్రతినిధి ముశం హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply