Take a fresh look at your lifestyle.

గిదెట్ల ప్రజాస్వామ్యం!?

విచ్చేసే ‘పుర’ ఎన్నికల సీజన్‌
‌చూడు పార్టీలకు ‘ఓటు’ విజన్‌

‌పాత పాటకే సరికొత్త రాగం
రాజకీయాలకిదో ‘పాడు’ రోగం

విమర్శల జడివాన కురిపిస్తరు
హమీల అమలు మరిపిస్తరు

బజార్లో తేల్చుకందమంటరు
రానీకి ముఖం చాటేస్తుంటరు

ప్రలోభాలకు గురి చేస్తరు
వోటరును బురిడీ కొట్టిస్తరు

గిట్లయితే ఎట్లా ప్రజాస్వామ్యం!!
ఎన్నికల తతంగం ధనస్వామ్యం!!!

Leave a Reply