Take a fresh look at your lifestyle.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: కోమటిరెడ్డి ఆరోపణ

, Clear Majority,Congress Party Coalition,Yadagirigutta Municipality

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ లో కాంగ్రెస్‌ ‌పార్టీ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ అధికార టీఆర్‌ఎస్‌ ఎలాగైనా సాధించాలనే దురుద్దేశంతో ప్రజల తీర్పునుకాదని ఎమ్మెల్సీలను ఎమ్మెల్యే ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంచార్జీ బీర్ల అయిలయ్య,అన్నారు ప్రజల ఆమోదం లేకుండా ప్రజల కు వ్యతిరేకంగా అక్రమ పద్ధతుల ద్వారా చైర్మన్‌ ‌పదవిని కైవసం చేసుకోవడం అనైతికమని వారు అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా వచ్చిన తీర్పును శిరసా వహించాల్సి ఉన్న అధికారం లో ఉన్నామనే అహంభావంతో యాదగిరిగుట్ట ప్రజలను అవమాన పరిచిన స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఎమ్మెల్సీలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.

ముఖ్యమంత్రి యాదాద్రికి 12 సార్లు విచ్చేసిన మున్సిపాలిటీలో నాలుగు సీట్లు రావడమే గొప్పగా చుట్టుకునే దుస్థితి ఏర్పడిందని వారు ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే పని తీరును దుయ్యబట్టారు ఎన్ని ఇబ్బందులు సృష్టించిన ఎన్ని ప్రలొభాలకు గురిచేసినపట్టణ ప్రజలు కాంగ్రెస్‌ ‌కూటమి వైపు ఉండడం గమనార్హం అని వారి నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారికి శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వారు తెలిపారు ఈ సమావేశంలో మండల పరిషత్‌ అధ్యక్షులు చీర శ్రీశైలం, గుండ్లపల్లి భరత్‌, ‌పెలిపెళ్లి శ్రీధర్‌, ‌తోపాటు ఎన్నికైన కౌన్సిలర్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: Democracy, cloaked Bhuvanagiri, Parliamentarians,Komatireddy

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply