గర్భిణీలకు డెలివరీ చేసే అవకాశం ఉన్న వైద్యులు ధైర్యం చేయకపోవడంతో ఏజెన్సీలో గర్భిణీలు జిల్లా కేంద్రం పోవాల్సి వచ్చేది కానీ అక్కడి కరెక్ట్ చొరవతో చేసిన మొ దటి ఆపరేషన్ విజయవంతం కావడంతో డాక్టర్స్ లో ఉత్సాహం నింపింది, వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా లో పెద్ద మండలం గా పేరు గాంచిన గూడూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం గర్భిణీలకు డెలివరీ చేసేఅవకాశం ఉన్న డాక్టర్స్ ధైర్యం చేయకపోవడంతో జిల్లా కేంద్రం అయిన మహబూబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది, కాగా పలుమార్లు గూడూరు మండల కేంద్రాన్ని పరిశీలించిన మహ బూబాబాద్ జిల్లా కలెక్టర్ వి ,పీ గౌతం స్థానికంగా ఉన్న పి హెచ్ సిలో నే డెలివరీ చేయాలని ఆదేశం చేయడంతో వైద్యులు అందుకు ముం దుకు వచ్చారు దీంతో గురువారం మొట్టమొదటి సారిగా డాక్టర్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ విజయవంతం కావడంతో వైద్యులు ఊపిరిపీల్చుకున్నారు.
కాగా ఇకనుండి డెలివరీ గూడూరు మండలం కేంద్రంలోని చేయాలని కలెక్టర్ ఆదేశాల తో ఏజెన్సీ గర్భిణీలకు వరంగా మారింది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న గర్భిణీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, గురువారం జిల్లా కోఆర్డినేటర్ భీమ్ సాగర్ సామాజికఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు ఈరోజు కొత్తగూ డెం మండలానికి హరితహారం కార్యక్రమానికి వెళ్లి వస్తున్న కలెక్టర్ గూడూరు పిహెచ్‌సిని సందర్శించి ఆపరేషన్ చేసి డాక్టర్ల ను అభినందించారు.