న్యూదిల్లీ,జనవరి24 :దిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మళ్లీ ఆగిపోయింది. మున్సిపల్ సమావేశంలో ఆప్, బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనల మధ్య మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. నిజానికి 6న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగాల్సి ఉండగా.. ఆప్, బీజేపీ కార్పొరేటర్ల గొడవ కారణంగా ఆ పక్రియ ఇవాళ్టికి వాయిదా పడింది. మంగళవారం మరోసారి మున్సిపల్ సమావేశం నిర్వహించగా.. మళ్లీ సేమ్ సీన్ రిపీటైంది.
ఇరు పార్టీల కార్పొరేటర్ల ఆందోళనతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పక్రియ వాయిదా పడింది. డిసెంబరు 4న దిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగగా, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు పూర్ఖ్తెంది. మొత్తం 250 స్థానాల్లో సభ్యులు పోటీకి దిగగా.. 134 వార్డుల్లో ఆప్, 104 వార్డుల్లో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మేయర్ పదవి కోసం ఆప్ తరపున షెల్లీ ఒబెరాయ్ పోటీ పడుతుండగా, బీజేపీ అభ్యర్థిగా రేఖా గుప్తా బరిలో నిలిచారు. ఆప్ బ్యాకప్ అభ్యర్థిగా అషు థాకూర్ పోటీలో ఉన్నారు.