Take a fresh look at your lifestyle.

దిల్లీ అత్యంత కాలుష్య రాజధాని..!

‌ప్రపంచంలోని 30 అత్యంత కాలుష్య నగరాలలో 22 నగరాలు భారతదేశంలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. వరల్డ్ ఎయిర్‌ ‌క్వాలిటీ రిపోర్ట్ 2020 ‌ప్రకారం దిల్లీ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన రాజధానిగా గుర్తించబడింది. దిల్లీలో నివసిస్తున్న ప్రజలకి పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను మండించటం జరిగితే ఢిల్లీ గాలి క్వాలిటీ ఏక్యూఐ 300 దాటిపోతున్నది. ఢిల్లీలో చలికాలం ఒక సవాలుగా పరిణమించింది. సగటున, కొన్ని రోజులు గాలి క్వాలిటీ ఏక్యూఐ 600 నుండి 800 వరకు కూడా వుంటున్నది.

ప్రపంచంలోని 30 నగరాల్లో ఇరవై రెండు భారత్‌లోనే..
మానవాళికి ‘కోడ్‌  ‌రెడ్‌’ ‌జారీ
ఈ నెల 31 నుండి కాప్‌ 26 ‌సమావేశాలు

భారత దేశంలో వాతావరణాన్ని భ్రష్టుపట్టిస్తున్న ఉద్గారాలు(ఎమిషన్స్) అత్యధికంగా వొస్తున్నది వ్యవసాయ రంగం నుంచి. ఎరువుల వాడకంతో వ్యవసాయం చేయటం, విపరీతమైన వరి సాగు వలన భారత్‌లో ఉద్గారాలు వొస్తున్నాయి.  యునైటెడ్‌ ‌కింగ్డమ్‌ 26‌వ యుఎన్‌ ‌వాతావరణ సమిట్‌కి ఆతిథ్యం ఇవ్వబోతుంది. పారిస్‌ ఒప్పందం ఆమోదించిన  లక్ష్యాల దిశగా చర్యలను వేగవంతం చేసే ఉద్దేశ్యంతో అక్టోబర్‌ 31 ‌నుండి నవంబర్‌ 12 ‌వరకు గ్లాస్గోలో వాతావరణ మార్పులపై మాట్లాడే పార్టీలన్నీ(కాప్‌ 26) ‌సమావేశం కానున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం వాతావరణాన్ని కాపాడటానికి ఏమి చేయనున్నదనేది చెప్పబోతున్నది. ఈ అంశం మన జీవితాలను ప్రతినిత్యం ప్రభావితం చేయనున్నది. పర్యావరణ, అటవీ శాఖ కేంద్ర మంత్రి భూపేందర్‌ ‌యాదవ్‌ ‌మాట్లాడుతూ..క్లైమేట్‌ ‌ఫైనాన్స్..‌తక్కువ ఖర్చుతో గ్రీన్‌ ‌టెక్నాలజీలకు బదిలీ కావటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు ఈసరికే చెప్పారు. వాతావరణ మార్పుపై ఇంటర్‌ ‌గవర్నమెంటల్‌ ‌ప్యానెల్‌(ఐపిసిసి) వర్కింగ్‌ ‌గ్రూప్‌-1 ఇచ్చిన అసెస్‌మెంట్‌ ‌రిపోర్ట్ ‌ప్రకారం 2040 నాటికి మన భూ  గ్రహం 1.5 డిగ్రీల సెల్సియస్‌ ‌వేడిమి వైపుకు దూసుకుపోనుంది. అందుకే ఐపిసిసి మానవాళికి ‘‘కోడ్‌ ‌రెడ్‌’’ ‌జారీ చేసింది.

చారిత్రక గ్లోబల్‌ ఉద్గారాల(ఎమిటర్స్) ‌గురించి దేశాలు ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాకుండా తర్జనభర్జన పడుతున్నాయి. ఒకరిపై ఒకరు నింద మోపుకోటమే కానీ ఎవరు తప్పును ఒప్పుకుని పరిష్కరించాలనుకోవడం లేదు. ప్రపంచంలోని 30 అత్యంత కాలుష్య నగరాలలో 22 నగరాలు భారతదేశంలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. వరల్డ్ ఎయిర్‌ ‌క్వాలిటీ రిపోర్ట్ 2020 ‌ప్రకారం దిల్లీ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన రాజధానిగా గుర్తించబడింది. దిల్లీలో నివసిస్తున్న ప్రజలకి పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను మండించటం జరిగితే ఢిల్లీ గాలి క్వాలిటీ ఏక్యూఐ 300 దాటిపోతున్నది.

ఢిల్లీలో చలికాలం ఒక సవాలుగా పరిణమించింది. సగటున, కొన్ని రోజులు గాలి క్వాలిటీ ఏక్యూఐ 600 నుండి 800 వరకు కూడా వుంటున్నది. గ్లోబల్‌ ‌కార్బన్‌ అట్లాస్‌ ‌ప్రకారం చుస్తే  చైనా (10 బిటి సిఓ2ఇక్యూ) ..యునైటెడ్‌ ‌స్టేట్స్ (5.4 ‌బిటి సిఓ2ఇక్యూ) ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. భారతదేశం మొత్తం గ్రీన్‌హౌస్‌ ‌వాయు ఉద్గారాలలో 2.6 బిలియన్‌ ‌టన్నుల (బిటి) సిఓ2ఇక్యూ ని విడుదల చేస్తూ మూడవ స్థానంలో ఉంది. భారత్‌ ‌తరువాత రష్యా (1.7బిటి), జపాన్‌ (1.2‌బిటి) వున్నాయి. వాతావరణ మార్పులపై ప్రపంచ చర్చలు జరిగే అప్పుడు తరచుగా తలసరి ఉద్గారాల గురించి..జిడిపి ఉద్గార తీవ్రత గురించి చర్చ జరుగుతుంది. ఈ లెక్క ప్రకారం చూసినా మొదటి స్థానంలో అత్యధిక తలసరి ఉద్గారాలను అమెరికా(15.24 టన్నులు), ఆ తర్వాత రష్యా (11.12 టన్నులు) ఉద్గారాలు విడుదల చేస్తున్నాయి. భారతదేశ తలసరి ఉద్గారాలు కేవలం 1.8 టన్నులు మాత్రమే. ప్రపంచ సగటు తలసరి 4.4 టన్నుల కంటే గణనీయంగా భారత్‌ ‌తక్కువ ఉద్గారాలు విడుదల చేస్తున్నది. అయితే ఈవాదనకి యుఎన్‌ ‌వాతావరణ సమిట్‌లో స్థానం లేదు.
ఇక జిడిపి ప్రకారం ఉద్గారాలను తీసుకుంటే కూడా 2017 జిపిడిలో ప్రతి పిపిపి వి 0.486 కిలోల ఉద్గారాలు విడుదల చేస్తూ..చైనా మొదటి స్థానంలో ఉంది. ఈ విషయంలో రష్యాకు చైనా చాలా దగ్గరగా ఉంది. ప్రపంచ సగటు 0.26 కొంచం ఎక్కువగా భారతదేశం 0.27 కిలోల ఉద్గారాలు విడుదల చేస్తున్నది. అయితే విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా ఎక్కువగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారతదేశం ఏడవ స్థానంలో ఉంది. ఇది ఆందోళన కలిగించే అంశం.

రంగాల వారీగా గ్లోబల్‌ ఉద్గారాలు
ప్రపంచం వ్యాప్తంగా విడుదల అయ్యే ఉద్గారాలలో 50 శాతం..ఎలక్ట్రిసిటీ అండ్‌ ‌హీట్‌ ఉత్పత్తి, వ్యవసాయం, అటవీ ఇతర భూ వినియోగం నుంచి ఉన్నట్లు రిపోర్టస్ ‌చూపుతున్నాయి. భారతదేశ ఉద్గారాలలో అతిపెద్ద భాగం అంటే 44 శాతం ఇంధన రంగం నుంచి వున్నది. దీని తరువాత మ్యానుఫ్యాక్చరింగ్‌.. ‌నిర్మాణ రంగం నుంచి 18 శాతం, వ్యవసాయం, అటవీ ఇతర భూ వినియోగ రంగాల నుంచి 14 శాతం ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. మిగిలిన వాటిలో  రవాణా, పారిశ్రామిక పక్రియల వ్యర్థాల భాగస్వామ్యం ఉంది. మొత్తం ఉద్గారాలలో వ్యవసాయం వాటా 1994లో 28 శాతం ఉండగా 2016లో 14 శాతానికి క్షీణించింది. వాస్తవ కొలతల్లో చుస్తే వ్యవసాయం నుండి వొచ్చే ఉద్గారాలు 2018లో సుమారు 650 ఎంటి సిఓ2 కి పెరిగాయి. ఇది చైనా నుండి వొచ్చే వ్యవసాయ ఉద్గారాల స్థాయికి సమానంగా ఉన్నది.

భారతదేశంలో వ్యవసాయ ఉద్గారాలు ప్రధానంగా పశుసంవర్ధక రంగం నుంచి మిథేన్‌ ఉద్గారాల రూపంలో  54.6 శాతం విడుదల అవుతున్నాయి. ఎంట్రిక్‌ ‌ఫెర్మెంటేషన్‌ ‌పక్రియ కారణంగా, నైట్రస్‌ ఆక్సైడ్లను విడుదల చేసే వ్యవసాయ నేలల్లో 19 శాతం నత్రజని ఎరువుల వాడకం వలన విడుదల అవుతున్నాయి. వ్యవసాయ ఉద్గారాలలో అనారోబిక్‌ ‌పరిస్థితులలో వరి సాగు వలన 17.5 శాతం ఉద్గారాలు విడుదల అవుతున్నాయి.  ఆ తరువాత పశువుల పెంపకం వలన 6.9 శాతం. పంట అవశేషాలను కాల్చడం వలన 2.1 శాతం ఉద్గారాలు వొస్తున్నాయి. గ్రీన్‌ ‌రివల్యూషన్‌ ‌భారత దేశంలో తిండికి లోటు లేకుండా పోయిందని మనం చెప్పుకుంటాం. మరీ ఆ గ్రీన్‌ ‌రివల్యూషన్‌ ఇచ్చిన సైడ్‌ ఎఫెక్టస్ ‌గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఇప్పుడు ఆ పని చేయమని ప్రకృతి డిమాండ్‌ ‌చేస్తున్నది.

Leave a Reply