Take a fresh look at your lifestyle.

దిశరవికి పోలీస్‌ ‌కస్టడి ఢిల్లీ హైకోర్టు అనుమతి

‌టూల్‌కిట్‌’ ‌కేసులో ఈనెల 13న బెంగళూరులో అరెస్టు చేసిన పర్యావరణ కార్యకర్త దిశారవికి ఒక రోజు పోలీసు కస్టడీకి ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు అనుమతించింది. జనవరి 26న ట్రాక్టర్‌ ‌ర్యాలీలో చోటుచేసుకున్న హింసపై పోలీసు దర్యాప్తులో భాగంగా ’టూల్‌కిట్‌’ ‌కేసు వెలుగుచూసింది. దిశా రవి మూడు రోజుల జ్యుడిషియల్‌ ‌కస్టడీ ముగియడంతో ఆమెను పాటియాల్‌ ‌హౌస్‌ ‌కోర్టు చీఫ్‌ ‌మెట్రోపాలిటలన్‌ ‌మేజిస్ట్రే ‌డాక్టర్‌ ‌పంకజ్‌ ‌శర్మ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఆమెను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించాలని ఢిల్లీ పోలీసులు కోరారు.
ఢిల్లీ పోలీసుల తరఫున న్యాయవాది వికాస్‌ ‌తన వాదన వినిపిస్తూ, ఈ కేసులో నికిత, శంతను అనే మరో ఇద్దరు నిందితులు ఉన్నారని, వాళ్లు కూడా విచారణకు హాజరుకావాల్సి ఉందని చెప్పారు. ఈ ఇద్దరికి అరెస్టు చేయకుండా ముంబై హైకోర్టు ముందస్తు రక్షణ కల్పించింది. టూల్‌కిట్‌ ‌వ్యవహారంలో ఈ ఇద్దరితో కలిపి దిశా రవిని విచారించాల్సి ఉందని కోర్టుకు వికాస్‌ ‌తెలిపారు. ఢిల్లీ పోలీసుల రిమాండ్‌ అప్లికేషన్‌ను దిశా రవి తరఫు న్యాయవాది సిద్దార్థ్ అగర్వాల్‌ ‌వ్యతిరేకించారు. పోలీసు కస్టడీ మొదటిసారి అన్నట్టుగా పబ్లిక్‌ ఎ•-‌లాసిక్యూటర్‌ ‌వాదిస్తున్నారని, గతంలో ఏడు రోజుల కస్టడీ అడిగి ఐదు రోజుల కస్టడీ పొందారని చెప్పారు. దాని గురించి కోర్టుకు వాళ్లు తెలియజేయలేదన్నారు.
దానిపై బెయిల్‌ అప్లికేషన్‌ ‌పెట్టుకోగా మూడు గంటల పాటు సెషన్స్ ‌కోర్టు విచారణ చేసిందని చెప్పారు. శంతను, నికితలు కస్టడీలో లేనందున తన క్లయింట్‌ను కస్టడీకి అడగడం సరికాదని అగర్వాల్‌ ‌వాదించారు. దీనికి పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ అగర్వాల్‌ ‌స్పందిస్తూ, పోలీసు కస్టడీని పనిష్మెంట్‌గా ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు. అది విచారణ సంస్థ హక్కు అని వాదించారు. కాగా, దిశా రవి దాఖలు చేసిన బెయిలు దరఖాస్తుపై ఢిల్లీ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు ఇవ్వనుంది. రైతుల నిరసనలపై ’టూల్‌ ‌కిట్‌’ ‌డాక్యుమెంట్‌ ‌రూపకల్పనతో పాటు, ప్రచారం చేసిందనే అభియోగాలను దిశారవి ఎదుర్కొంటోంది. ఈ ప్రచారమే జనవరి 26న హింసకు దారితీసిన్టటు పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply