Take a fresh look at your lifestyle.

గుడ్‌ ‌గవర్నెన్స్ ‌వర్సెస్‌ ‌హిందుత్వ..?

“దిల్లీ ఎన్నికలు – 2020 అధికారం కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ, బిజెపి.. చేస్తున్న రాజకీయాలలో మనకు స్పష్టం అయ్యేది రెండు విషయాలు. మొదటిది అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ఢిల్లీ ప్రజలను గుడ్‌ ‌గవర్నెన్స్‌ను గుర్తించే ప్రజలుగా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బిజెపి ఢిల్లీ ప్రజలు పక్కా హిందూ రాజకీయాలలో మునిగితేలుతున్నారు అని అంచనా వేస్తున్నది. ఈ అంచనాలలో ఏ అంచనా సరైనది అన్నది ఢిల్లీ ప్రజలు ఫిబ్రవరి 8వ తారీకున తేల్చనున్నారు.”

Good Governance versus Hindutva

క్రోనాలజీ..ఈ పదం దేశ రాజకీయాలను గడగడలాడిస్తున్నది. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8వ తారీఖున వోటింగ్‌ ‌జరగనుంది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలకు క్రోనాలజీ భూతం పట్టింది. అదెలా అంటే జనవరి 20వ తారీఖున వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌గా ఉన్న జేపీ నడ్డా, బిజెపి జాతీయ అధ్యక్ష బాధ్యతలుచేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ తన ప్రసంగంలో ఢిల్లీ ఎన్నకల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం గురించి మార్మికంగా పార్టీ కేడర్‌కి సంకేతం ఇచ్చారు. ప్రధానమంత్రి సందేశం ఇలా సాగింది ‘‘ఆ టోలి(సమూహం) మనకు ఎప్పుడూ మద్దతు దొరకదు. మన రాజకీయం ఆ టోలి మీద ఆధారపడి లేదు. ఈ విషయంలో మనకు మీడియా సంస్థలు కూడా సహకరించవు. మన సొంత పార్టీ క్యాడర్‌ ‌మీద ఆధారపడి ఢిల్లీ ఎన్నికలు ఎదుర్కోవాలి. అందుకు సిద్ధం కండి’’ ఇలా మార్మికంగా ఢిల్లీ ఎన్నికలను ఎజెండాను తమ మూలమంత్రం అయినా హిందూ ధృవీకరణ ప్లాన్‌ ‌ప్రధానమంత్రి ప్రకటించారు. ప్రధానమంత్రి తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా మాట్లాడుతూ, ‘‘షాహీన్‌ ‌బాగ్‌ ‌లాంటివి వద్దు అనుకుంటే ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ వోటింగ్‌ ‌బటన్‌ ‌పైన బలంగా నొక్కి ఆ కరెంట్‌ ‌షాక్‌ ‌షాహీన్‌ ‌బాగ్‌కి తగిలేలా చేయండి’’ అని ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ప్రధానమంత్రి, షాల నుంచి సందేశం అందుకున్న తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‘‘‌షాహీన్‌ ‌బాగ్‌ ‌నిశ్శబ్దంగా ఉన్న మెజారిటీ ప్రజలను అణచివేసే ప్రయత్నం’’ అని ప్రకటించారు. వీటన్నిటికీ మించి పోయేలాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌ఢిల్లీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ‘‘దేశ్‌ ‌కే గద్దరొంకో..గోలి మరో సాలొంకో..’’ (ఇలా ప్రకటించిన రెండు రోజులకే జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద గోపాల్‌ అనే యువకుడు తుపాకీ గుళ్ళు పేల్చాడు) అని ప్రకటించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి వొచ్చి బిజెపిలో చేరిన కపిల్‌ ‌మిశ్రా ‘‘ఫిబ్రవరి 8వ తారీఖున భారతదేశం వర్సెస్‌ ‌పాకిస్తాన్‌ ‌మ్యాచ్‌ ‌కానుంది’’ అని ప్రకటించారు. గతంలో దిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సాహెబ్‌ ‌సింగ్‌ ‌వర్మ కొడుకు పరష్‌ ‌వర్మ ‘‘బిజెపి కనక డిల్లీలో అధికారంలోకి వొస్తే ప్రభుత్వ స్థలాలలో ఉన్న మసీదులు అన్ని కూలగోడతామని ప్రకటించారు. అంతేకాదు షాహీన్‌ ‌బాగ్‌ ‌మూకలు గనుక గెలిస్తే మీ ఇళ్లల్లో ఆడవారు రేప్‌లకు గురవుతారు. అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌గెలిస్తే మీ ఆడవారిని కాపాడేందుకు మోడీ, అమిత్‌ ‌షాలు రారు’’ అని ప్రకటించారు. అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఉ‌గ్రవాది అని కూడా ప్రకటించారు బిజెపి నాయకులు. క్రోనాలజీ ఇలా కొనసాగి.. ధ్రువీకరణ రాజకీయాల ప్రకటనలు చేస్తూ బీజేపీ దిల్లీ ఎన్నికలను కాంప్లికేట్‌ ‌చేసింది.

Good Governance versus Hindutva1జనవరి 20 తారీకు ముందు వరకు కూడా దిల్లీ ఎన్నికలు అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌మాట్లాడుతున్న గుడ్‌ ‌గవర్నెన్స్ అం‌శం ప్రధాన చర్చలో ఉండింది. బిజెపి ఫిబ్రవరి ఒకటవ తారీఖున తీసుకు రానున్న బడ్జెట్లో మధ్యతరగతి మానవులకు టాక్స్ ‌రిబేట్‌ ఇస్తూ బీజేపీ ఢిల్లీ ఎన్నికలను ప్రభావితం చేస్తుంది అనే ఒక విశ్లేషణ ఢిల్లీలో చక్కర్లు కొట్టింది. అయితే భారత దేశ ఎన్నికలు గుడ్‌ ‌గవర్నెన్స్ ‌లేదా ప్రజల కోసం పనిచేయడం చుట్టూ తిరగవు అని గట్టిగా నమ్మే కాషాయ పార్టీ తమ ఎన్నికల ఎజెండా.. ధ్రువీకరణ ఎజెండా.. అని స్పష్టం చేస్తూ.. ఢిల్లీ ఎన్నికలు స్ట్రాటజీ మొత్తం షహీన్‌ ‌బాగ్‌ అం‌శం చుట్టూ మలచి రాజకీయం చేసింది. నిజానికి షహీన్‌ ‌బాగ్‌ అనేది కేవలం ఢిల్లీలోనే లేదు. దేశవ్యాపితంగా షాహీన్‌ ‌బాగ్‌ ఉం‌ది. బిజెపి ఇంత సులువుగా ధ్రువీకరణ రాజకీయం చేయటానికి ఆస్కారం అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌రాజకీయంలోనే ఉంది. 2013, 14, 15 లాగా ‘‘ఆల్టర్నేటివ్‌ ‌రాజకీయాలు అందిస్తాం’’ అన్న అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఈసారి ఎన్నికలలో ప్రధాన అంశం ఆల్టర్నేటివ్‌ ‌పాలిటిక్స్ ‌కాదు అన్నట్లు వ్యవహరించారు. 2014లో మోడీ కేంద్రంలో అధికారం చేబడితె …. 2015లో అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ఢిల్లీ గద్దె ఎక్కారు. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న 70 సీట్లలో 67 సీట్లు అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌గెలిచారు. మోడీ వేవ్‌లో అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఈ ‌ఫలితాన్ని సాధించారు. 2019లో 2014 కంటే బలమైన ప్రధానిగా మోడీ అవతరించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీల వోట్లు కలిపిన కూడా బిజెపి వోట్లను అందుకోలేనంత ఎక్కువ వోట్లు బీజేపీకి పడేలా చేసి ఢిల్లీలో ఉన్న ఏడు లోక్‌సభ స్థానాలు బిజెపి ఎగరేసుకుపోయింది. ఇలా జరగటానికి కారణం పుల్వామా రాజకీయం ప్రధాన పాత్ర పోషించింది అన్న విషయం మర్చిపోకూడదు.

ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఎన్నికల ఫేస్‌ ‌మోడీ. మోడీ మాతో ఉంటే సాధ్యం అన్నది బీజేపీ మాట. ఇటువంటి పరిస్థితిలో అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‘‘ఆల్టర్నేటివ్‌ ‌పాలిటిక్స్’’ ‌చేయలేక.. ఆల్టర్నేటివ్‌ ‌పాలిటిక్స్‌కి చేయాల్సిన త్యాగం చేయలేక .. ఆల్టర్నేటివ్‌ ‌పాలిటిక్స్ ‌మాటను పక్కన పడేసి గుడ్‌ ‌గవర్నెన్స్ ‌పల్లవి ఎత్తుకున్నారు. తత్ఫలితంగా కేజ్రీవాల్‌ ‌నేను స్కూలు బాగు చేశాను..మొహల్లా క్లినిక్‌లు పెట్టి ఆరోగ్యాన్ని అందిస్తున్నాను.. విద్యుత్తు నీళ్లు చవక చేశాను.. ఇదే కొనసాగిస్తాను అందుకే నన్ను ఎంచుకోండి అంటున్నారు. ‘‘ఐదేళ్లు బాగా గడిచాయి.. అందుకే కేజ్రీవాల్‌ని కొనసాగించండి’’ అని అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఇస్తున్న పిలుపుకు బీజేపీ ఇచ్చిన బదులు షాహీన్‌ ‌బాగ్‌ ‌రాజకీయం. ఆమ్‌ ఆద్మీ పార్టీ, బిజెపి అధికారం కోసం చేస్తున్న రాజకీయాలలో మనకు స్పష్టం అయ్యేది రెండు విషయాలు. మొదటిది అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ఢిల్లీ ప్రజలను గుడ్‌ ‌గవర్నెన్స్‌ను గుర్తించే ప్రజలుగా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బిజెపి ఢిల్లీ ప్రజలు పక్కా హిందూ రాజకీయాలలో మునిగితేలుతున్నారు అని అంచనా వేస్తున్నది. ఈ అంచనాలలో ఏ అంచనా సరైనది అన్నది ఢిల్లీ ప్రజలు ఫిబ్రవరి 8వ తారీకున తేల్చనున్నారు.

Good Governance versus Hindutva1అసలు ఢిల్లీ ప్రజలు అంటే ఎవరు? 1951 జనాభా లెక్కల ప్రకారం 17 లక్షల నలభై నాలుగు వేల డెబ్బైరెండు మంది పాకిస్తాన్‌ ‌నుంచి వలస వచ్చిన వారు, ఉత్తరప్రదేశ్‌ ‌నుంచి ఢిల్లీకి మైగ్రేట్‌ అయిన రెండు లక్షల అరవై రెండు వేల మంది, పంజాబ్‌, ‌హిమాచల్‌, ఉత్తరాఖండ్‌ ‌నుంచి మైగ్రేట్‌ అయి వొచ్చిన ఒక లక్ష అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది, రాజస్థాన్‌ ‌నుంచి వలస వచ్చిన నలభై ఎనిమిది వేల మంది,1951 నాటికి ఢిల్లీ గడ్డ సొంత ప్రజలు ఏడు లక్షల పదిహేడు వేల మూడు వందల పది మంది ప్రజలు ఢిల్లీ ప్రజలు. ఇదే ట్రెండ్‌ ‌నేటికి కూడా కొనసాగుతున్నది. దిల్లీని దిల్‌ ‌వాలి అంటారు..అలాగే ఢిల్లీని మినీ ఇండియా అంటారు. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు వివిధ రకాల ఉద్యోగాల కోసం వొచ్చి స్థిరపడిన వారు ఉన్నారు. ప్రస్తుతం పూర్వాంచల్‌ ‌వాసులనే ప్రజలు 20% నుంచి 24% ఢిల్లీలో ఉన్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌, ‌బీహార్‌, ‌జార్ఖండ్‌, ‌బెంగాల్‌ ‌నుండి వొచ్చిన వారు. వీరందరికీ ఢిల్లీలో వోటింగ్‌ ‌రైట్‌ ఉం‌ది. వీరందరూ ఏ తీరుగా వోటింగ్‌ ‌చేస్తారు అన్నది ఆసక్తికరమైన అంశం. ఇది కాకుండా ఢిల్లీ ఎడ్యుకేషన్‌ ‌హబ్‌. ‌ప్రస్తుతం ఈ ఎడ్యుకేషన్‌ ‌హబ్‌..‌పౌరసత్వ సవరణ చట్టంపై, ఎన్‌ఆర్సీపై తీవ్రంగా పోరాటం చేస్తున్నది. వివిధ రాష్ట్రాల నుంచి వొచ్చి ఢిల్లీలో స్థిరపడిన వారి పిల్లలు అంతా కూడా స్టూడెంట్స్‌గా ఉన్నారు. వీరి మైండ్‌ ‌సెట్‌ ఏ ‌విధంగా పనిచేస్తుంది..? వీరి వలన వీరి పేరెంట్స్ ‌మైండ్‌ ‌సెట్‌ ఏ ‌విధంగా పనిచేస్తుంది అన్న విషయం అతి ప్రధానమైనది. అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ ‌గురించి మాట్లాడుతూ..ఆయన ఇంతవరకు పౌరసత్వ సవరణ చట్టం గురించి ఎన్‌ఆర్సీ గురించి ఎక్కడ మాట్లాడటం లేదు. పైగా ఢిల్లీలో ఎన్నో ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఆ ధర్నా కార్యక్రమాలు అన్నింటికీ దూరంగా కేజ్రీవాల్‌ ఉన్నారు. ఈ వైఖరి వల్ల మెజారిటీ హిందువులు ఏ తీరుగా వోటు వేస్తారు.

అలాగే ఢిల్లీలో 17 ముస్లిం మెజారిటీ ఉన్న నియోజకవర్గాలలో కేజ్రీవాల్‌ ‌పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఢిల్లీకి ప్రాంతీయ భావజాలం లేదు. వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉండటం వలన ప్రాంతీయ భావన కంటే పాలసీపై చర్చ ఎక్కువ జరుగుతుంది. పాలసీపరంగా చూసినప్పుడు బీజేపీ ఢిల్లీ ప్రజలకి ధ్రువీకరణ రాజకీయాలు ఆఫర్‌ ‌చేస్తున్నది. యాంటీ కరప్షన్‌ ‌మూమెంట్లో ఒక కొత్త రాజకీయ పార్టీగా పుట్టి బీజేపీని ఎదుర్కునే లాగా ఆల్టర్నేటివ్‌ ‌పాలిటిక్స్ ఆఫర్‌ ‌చేయలేక గుడ్‌ ‌గవర్నెన్స్ ‌ఢిల్లీ ప్రజలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆఫర్‌ ‌చేస్తున్నది. అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఒక రీజినల్‌ ‌పార్టీ నాయకుడు లాగా ప్రస్తుత ఎన్నికల్లో కనిపిస్తూ.. తన పార్టీ ఉనికిని, తన ఉనికిని కాపాడుకుంటూ వొస్తున్నారు. ప్రస్తుత ఎన్నికలలో అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ఢిల్లీకి చెందిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు. ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నప్పుడు బీజేపీ ధ్రువీకరణ రాజకీయం ఏ మేరకు పని చేస్తుంది అన్నది ఢిల్లీ ప్రజలు తేల్చి చెప్పనున్నారు. ఢిల్లీ అంటే పొల్యూషన్‌.. ‌ఢిల్లీ అంటే మహిళలకు రక్షణ లేని నగరం…విచిత్రంగా ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఈ రెండు ప్రాధాన్యత అంశాలు కాకపోవటం ఢిల్లీ ప్రజల దురదృష్టం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల పరీక్ష ఎదుర్కొంటున్నది బీజేపీ ,ఆమ్‌ ఆద్మీ పార్టీ… కాదు ఢిల్లీలో రాజకీయ అవగాహన ఉన్న ఓటర్లు అసలైన పరీక్షలో ఉన్నారు.

Tags: Arvind Kejriwal,a regional party leader, Aam Aadmi Party Offers, Good Governance, Delhi People,Aam Aadmi Party, BJP to hold 2020 power

Leave a Reply