Take a fresh look at your lifestyle.

దిల్లీలో కేసులు తగ్గుముఖం ..!

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ,మే 8:
లాక్ డౌన్ ఎఫెక్ట్ తో 22 రోజుల తర్వాత ఢిల్లీ లో తొలిసారి కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. మూడు రోజులుగా 20 వేల లోపు కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. శనివారం ఈ సంఖ్య మరింత తగ్గడంతో 17,364  కొత్త కేసులు నమోదయ్యాయి. 332 మంది కరోనాకు బలయ్యారు. ఏప్రిల్ 15 న  చివరిసారిగా తక్కువగా కేసులు నమోదయ్యాయి. 82, 589 పరిక్షలు నిర్వహించగా 16,699 మందికి కరోనా అని తేలింది. అప్పటి నుంచి ప్రతి రోజు భారీగా కరోనా కేసులు రికార్డు అవుతున్నాయి. ఏప్రిల్ 20 న అత్యధికంగా 28 వేలకు పైగా కేసులు నమోదు కాగా, ఏప్రిల్ 30 న 27 వేల కేసులు నమోదయ్యాయి.
కాగా, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో  కొద్ది రోజులుగా సుమారు 20 వేల కరోనా కేసులు వస్తున్నాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో… వచ్చే వారం కూడా ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటీవ్ రేటు  32%  నుంచి 23.3%నికి చేరింది. ఢిల్లీలో ఇప్పటి వరకు 13,10,231 మందికి కరోనా సోకగా,  12, 03, 253 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.  19,071 మంది కరోనాతో మరణించారు.  ప్రస్తుతం 87,907 యక్టీవ్ కేసులున్నాయి. కరోనా కట్టడి కోసం ఢిల్లీ  మొత్తంగా 51,338 కంటైన్మెంట్ జోన్ల ను ప్రభుత్వం  ఏర్పాటు చేసింది.

Leave a Reply