Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో దారికొస్తున్న పరిస్థితులు

34కు చేరిన మృతుల సంఖ్య
పరిస్థితిని చక్కబెడుతున్న పోలీసులు…పలుప్రాంతాల్లో పోలీసుల ఫ్లాగ్‌ ‌మార్చ్

సోనియా గాంధీ నేతృత్వం లో రాష్ట్రపతి ని కలిసిన కాంగ్రెస్ పార్టీ బృందం

ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. ఇప్పుడక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనేలా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకున్నా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరు మృతి చెందారు. దీంతో  ఢిల్లీ మతఘర్షణల్లో మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరుకున్నది.  ఈశాన్య ఢిల్లీలో గత మూడు రోజుల క్రితం .. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీసాయి. వరుసగా మూడు రోజుల పాటు రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఆ సంఘటనల్లో మరణించిన వారి సంఖ్య 34కు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరో 200 మంది గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం అల్లర్లు ప్రారంభం కాగా,తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన రెండు వర్గాలు.. స్థానికంగా ఉన్న షాపులు, ఇండ్లు, వాహనాలకు నిప్పుపెట్టారు.  ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.  జఫ్రాబాద్‌, ‌మౌజ్‌పుర్‌, ‌బాబర్‌పుర్‌, ‌యమునా విహార్‌, ‌చాంద్‌ ‌భాగ్‌, ‌శివ్‌ ‌విహార్‌ ‌ప్రాంతాల్లో హింస హెచ్చు స్థాయిలో జరిగింది. జీటీబీ హాస్పటల్‌లో గురువారం  అయిదుగురు చనిపోయారు, దాంతో మృతుల సంఖ్య పెరిగినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. చాంద్‌భాగ్‌లో డ్రైనేజీలో బుధవారం ఐబీ ఆఫసర్‌ ‌శవాన్ని వెలికితీశారు. ఇదిలావుంటే ఢిల్లీ పోలీస్‌ ‌జాయింట్‌ ‌కమిషనర్‌ ఓపి శర్మ చాంద్‌బాగ్‌లో గురువారం ప్లాగ్‌మార్చ్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. ఎలాంటి భయం లేకుండా దుకాణ సమూదాయాలు తెరుచుకోండని అన్నారు. కు రక్షణగా మేమున్నామని తెలిపారు. ముఖ్యంగా మెడికల్‌ ‌షాపులు, కిరాణం.. తదుపరి షాపులన్నీ తెరిచి ప్రజలకు సహకరించాలని ఆయన కోరారు. రోడ్లపై ఎవరూ గ్రూపులుగా ఉండకూడదనీ.. ముఖ్యంగా యువకులు బృందాలుగా ఏర్పడకూడదని ఈ సందర్భంగా తెలిపారు.
మరో వైపు అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ నేతృత్వం లో ఆ పార్టీ బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి దిల్లీ లో గత నాలుగు రోజులుగా నెలకొన్న పరిస్థితులను వివరించారు . అసాంఘిక శక్తులను అరికట్టడం లో కేంద్ర ప్రభుత్వం మరియు కేజ్రీవాల్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ..సామాన్య పౌరుల కు రక్షణ కలిపించేలా చర్యలు తీసుకునే విధంగా రాష్ట్రపతి చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు . సోనియా గాంధీ తో పాటు మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ , గులాం నబి ఆజాద్ , చిదంబరం తదితరులు రాష్ట్రపతి ని కలిశారు.

Leave A Reply

Your email address will not be published.