Take a fresh look at your lifestyle.

రక్షణరంగంలో ఇజ్రాయిల్‌ ‌సహకారం

ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌
భారతదేశం, ఇజ్రాయెల్‌ ‌మధ్య రక్షణరంగంలో సహకారంపై ఇరు దేశాల రక్షణ మంత్రులు టెలిఫోన్‌ ‌ద్వారా శుక్రవారం చర్చించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌ట్విటర్‌ ‌వేదికగా ఈ వివరాలను వెల్లడించారు. ‘ఇజ్రాయెల్‌ ‌రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్‌తో టెలిఫోన్‌ ‌ద్వారా చర్చించాను. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం ప్రగతి గురించి సక్షించాను’ అని రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ప్రస్తుతం వేధిస్తున్న కోవిడ్‌-19 ‌మహమ్మారి
గురించి, ఈ పీడపై పోరాడవలసిన తీరు గురించి చర్చించినట్లు పేర్కొన్నారు.

చైనా, పాకిస్థాన్‌లతో భారతదేశానికి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ‌రక్షణ మంత్రితో రాజ్‌నాథ్‌ ‌చర్చలకు ప్రాధాన్యం ఉంది. భారతదేశ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రక్షణశాఖకు అత్యవసర ఆర్థిక అధికారాలను ఇవ్వడంతో ఇజ్రాయెల్‌ ‌నుంచి హెరోన్‌ ‌సర్విలెన్స్ ‌డ్రోన్లు, స్పైక్‌ ‌యాంటీ ట్యాంక్‌ ‌గైడెడ్‌ ‌మిసైల్స్‌ను కొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెరోన్‌ ‌మానవ రహిత ఏరియల్‌ ‌వెహికల్స్ ఇప్పటికే మన దేశ త్రివిధ దళాల్లో ఉన్నాయి. వీటిని లడఖ్‌ ‌సెక్టర్‌లో ఉపయోగిస్తున్నారు.

Leave a Reply