Take a fresh look at your lifestyle.

విద్యుత్‌ ‌సరఫరాలో లోపం ప్రభుత్వ వైఫల్యమే టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్‌ ‌సరఫరాలో లోపం తలెత్తిన ఘటనకు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీ పీసీసీ చీఫ్‌ ఎ.‌రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్‌ ‌రెడ్డి విద్యుత్‌ ‌సరఫరాలో లోపం తలెత్తడంపై శుక్రవారం ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్‌ ‌కోతలు రైతులకు గుండెకోతను మిగుల్చుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌తప్పుడు విధానాతో విద్యుత్‌ ‌వ్యవస్థను గుల్ల చేసి పారేశారనీ, విద్యుత్‌ ‌కొనుగోళ్లలో ఆయనకు కమీషన్లు, విద్యుత్‌ ‌వ్యవస్థలకు అప్పులు మిగిలాయని పేర్కొన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్‌ 24 ‌గంటల పాటు ఇస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం విద్యుత్‌ ‌సరఫరాలో లోపంపై రైతులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఏది ఏమైనా పంటలకు చివరి తడి పూర్తయ్యే వరకు నిర్విరామ విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. రైతులకు పంట చేతికి వచ్చే చివరి సమయంలో విద్యుత్‌ ‌సరఫరాలో లోపానికి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహంచాలనీ, ఇకపై ఇలాంటి ఘటనలు తలెత్తకుండా చూడాలని ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Leave a Reply