Take a fresh look at your lifestyle.

నియంతల అహంకారం ఓడింది

సాగుచట్టాల రద్దుపై సోనియా గాంధీ వ్యాఖ్య
సత్యాగ్రహంతో కేంద్ర ప్రభుత్వ అహంకారాన్ని ఓడించారు : రాహుల్‌ ‌గాంధీ
అన్యాయంపై విజయం : రైతులకు మమతా బెనర్జీ అభినందన
రైతులు, కార్మికులపై అధికారంలో ఉన్న వారి కుట్రలు చిత్తయ్యాయని, నియంత పాలకుల అహకారం ఓడిందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. సత్యం, న్యాయం అహింస గెలిచాయని అభివర్ణించారు. వివాదాస్పద సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి మోదీ ప్రకటించడంపై ఆమె స్పందిస్తూ, రైతుల జీవనోపాధి, వ్యవసాయంపై దాడికి జరిగిన కుట్ర ఓటమి పాలైందని అన్నారు. ఇది అన్నదాతల విజయమని ఆమె అభివర్ణించారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ తన స్పందన తెలుపుతూ.. రైతులు చేపట్టిన సత్యాగ్రహం..కేంద్ర ప్రభుత్వ అహంకారాన్ని ఓడించినట్లు పేర్కొన్నారు. రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటన చేసిన తర్వాత..రాహుల్‌ ‌గాంధీ తన ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. దేశ రైతులు తమ సత్యాగ్రహ దీక్షతో..కేంద్ర సర్కార్‌ అహంకారాన్ని తలదించుకునేలా చేశారన్నారు. ఇది అన్యాయంపై విజయమని, ఈ సందర్భరంగా రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. జై హింద్‌, ‌జై కిసాన్‌ అం‌టూ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన పాత వీడియోను కూడా తన ట్విట్టర్‌లో రాహుల్‌ ‌షేర్‌ ‌చేశారు. రైతు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా చేస్తామని, తన మాటాలను గుర్తుపెట్టుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను రాహుల్‌ ‌పోస్టు చేశారు. దేశంలో కేంద్రం తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు నిర్ణయంపై పశ్చిమబెంగాల్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు. అహంకారం ఓడిపోయింది, అన్యాయానికి వ్యతిరేకంగా రైతులు పోరాడి విజయం సాధించినందుకు అభినందనలని అన్నారు. ఏవి• పట్ల ప్రవర్తించిన క్రూరత్వానికి చలించకుండా అవిశ్రాంతంగా పోరాడిన ప్రతి ఒక్క రైతుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇది వి• విజయం..ఈ పోరాటంలో మరణించిన రైతులకు నా ప్రగాఢ సానుభూతి‘ అని మమతాబెనర్జీ ట్వీట్‌ ‌చేశారు. మొత్తంవి•ద సాగు చట్టాల రద్దుపై దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ రైతులను అభినందించారు

Leave a Reply