Take a fresh look at your lifestyle.

చిత్తూరు జిల్లాలో పరువు హత్య

యువకుడిని చంపి పాతిపెట్టిన అమ్మాయి తండ్రి
చిత్తూరు, మే 28 : చిత్తూరు జిల్లాలో పరవు హత్య కలకలం రేపుతోంది. పలమనేరు మండలం పెంగరగుంట గ్రామానికి చెందిన ధనశేకర్‌ (23) అనే యువకుడు.. ప్రేమికురాలు తండ్రి బాబు చేతలో దారుణ హత్యకు గురయ్యాడు. ప్రియురాలి తండ్రి యువకుడిని కిరాతకంగా నరికి, వ్యవసాయ పొలంలో పాతి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని తాను పాతిపెట్టిన ప్రదేశం నుంచి వెలికి తీశాడు.

ధనశేఖర్‌ ‌శరీరాన్ని నాలుగు ముక్కలు చేసి వేరువేరుగా పాతిపెట్టినట్టు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. ఆ విడిభాగాలను అధికారులు వెలికి తీస్తున్నారు. ధనశేఖర్‌ను ఎన్ని సార్లు హెచ్చరించినా మాట వినకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు బాబు అంగీకరించాడు. పోలీసులు దీనిని పరువు హత్యగా భావిస్తున్నారు.

Leave a Reply