హైదరాబాద్‌లో దారుణం జరిగింది. . ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంటపై యువతి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. యువకుడిని కిడ్నాప్ చేయించి అతి కిరాతకంగా హత్య చేయించాడు. ప్రధానంగా యువతి మేనమామ ఇందులో కీలకంగా పాల్గొన్నాడని సమాచారం. అతనే బలవంతంగా ఎత్తుకెళ్లి దారుణంగా హత్య చేశాడని తెలుస్తోంది. చందానగర్‌లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి కిరాయి మనుషులతో యువకుడిని కిడ్నాప్ చేయించి దారుణంగా హ్యతచేయించి సంగారెడ్డి సవి•పంలో పడవేయించాడు. యువ జంట చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయినా వారిని వదలకుండా కిడ్నాప్ చేశారు.
చందానగర్‌లో మిస్సింగ్ కేసు, సంగారెడ్డిలో హత్య కేసు నమోదు అయిన్నాయి.కాగా.. కొండాపూర్ మండలం కిష్టాయగూడెం శివాయలోని చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. హేమంత్ హత్యపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు.. అర్ధరాత్రి కిష్టాయగూడెం వచ్చి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. పోలీసు వాహనాలను చూసి పెట్రోలింగ్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లింది. దీంతో హేమంత్ హత్య జరిగినట్లు సంగారెడ్డి పోలీసులు తెలుసు కున్నారు. కిష్టాయగూడెం శివారులో ఆధారాల సేకరణకు సంగారెడ్డి క్లూస్ టీమ్ వెళ్లింది. నిందితులను గచ్చిబౌలి పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు హేమంత్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. రాత్రివరకు అతడు ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన అతడి కుటుంబీకులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం సంగారెడ్డిలో హేమంత్ శవమై కనిపించాడు. కూతురును ప్రేమపెళ్లి చేసుకోవడంతో యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులే హత్య చేయించారని హేమంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హేమంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కులాలు వేరు కావడమే హేమంత్ హత్యకు కారణమని యువకుడు హేమంత్ తల్లి ఆరోపించారు. సందీప్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, యుగేందర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డే తమ కుమారుడిని హత్య చేయించారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకొని కుమారుడిని పెంచుకున్నామని ఇంత దారుణానికి ఒడిగడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్త చేశారు. పలుమార్లు ఇంటికి సైతం వచ్చి తమను బెదిరించారని, హేళన చేసి మాట్లాడారని ఆరోపించారు. గురువారం సాయంత్రం పదిమంది ఇంట్లోకి వచ్చి జంటను కారులో అపహరించారని తెలిపారు. తాము వారికి దూరంగా ఉన్నామని, తమ కుమారుడిని హత్య చేసి తమకు పుత్రశోకం కలిగించారని వోకతప్తం అయ్యారు. చిన్ననాటి నుంచి హేమంత్ నేను ఒకే ప్రాంతంలో పెరిగాం. ఎనిమిదేండ్ల నుంచి ప్రేమించుకున్నాం. నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నాం. మా ఇంట్లో వివాహం ఇష్టం లేకపోవడంతో గచ్చిబౌలిలో ఉంటున్నాం. పలుమార్లు బెదిరించడంతో ఇంట్లో నుంచి కూడా బయటకు రావడంలేదు. హేమంత్‌ను నన్ను మా బంధువులే బలవంతంగా లాక్కెళ్లారు. బావ, వదినలు, మావయ్యలే ఈ హత్య చేయించారు. పెళ్లిముందు మా ప్రేమ విషయం తెలిసి 7 నెలలు నన్ను ఇంటికే పరిమితం చేశారు. పెద్దవారు మాట్లాడుతున్నారని అనుకున్నా కానీ ఇంతలో దారుణం చేస్తారని ఊహించలేదని హేమంత్ భార్య అవంతి కంటతడి పెట్టారు. ఇంతదారుణంగా హత్య చేసిన వారిని ఎన్కౌంటర్ చేయాలన్నారు. ఇలాంటి ఘటనలు ఇకముందు జరక్కుండా భయపడేలా శిక్షలు పడాలన్నారు.