Take a fresh look at your lifestyle.

రాజ్యసభలో తీవ్ర గందరగోళం

  • ప్రధాని ప్రసంగానికి తీవ్ర అంతరాయం
  • జెపిసి డిమాండ్‌తో పోడియం వద్ద ప్రతిపక్షాల ఆందోళన
  • ఎంతగా బురద జల్లితే..అందులో కమలం అంతగా వికసిస్తుంది
  • గందరగోళం మధ్య ప్రసంగం కొనసాగిస్తూనే ప్రధాని మోదీ చురకలు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : రాజ్యసభలో గతంలో ఎన్నడూ లేనంతగా గందరగోళం చెలరేగింది. ప్రధాని మోడీ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విపక్షాలన్నీ మూకుమ్మడిగా బిగ్గరగా నినాదాలు చేశాయి. పోడియంలోకి దూసుకుని వొచ్చి ఆదానీ వ్యవహారంపై జెపిసికి డిమాండ్‌ ‌చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో విపక్షాలను లెక్కచేయని ప్రధాని మోదీ తన ధోరణిలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. విపక్షాల నినాదాల మధ్య మోదీ ఏం మాట్లాడుతున్నారో కూడా వినిపించలేదు. అయినా వెనక్కి తగ్గకుండా..నినాదాలను లెక్కచేయకుండా ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే.. విపక్షాలనుద్దేశించి, వి•రు బిజెపిపై ఎంతగా బురద జల్లితే..కమలం అంతగా వికసిస్తుందని అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..తమ ప్రభుత్వం గత నాలుగేళ్లలో 11 కోట్ల ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఇచ్చాం, తొమ్మిదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 48 కోట్ల జనధన్‌ ‌ఖాతాలు తెరిచామన్నారు.

ఓ వైపు ప్రధాని మోడీ మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు అదానీ, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించారు. ఈ క్రమంలో ఓ వైపు నినాదాలు..మరోవైపు మోడీ ప్రసంగంతో ఏం జరుగుతుందో తెలియని గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే బుధవారం కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ అదానీ కేసులో సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తును చేపట్టాలన్నారు. ‘ప్రభుత్వానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయడానికి భయం లేకుంటే దానిని వేయాలి, పార్లమెంటరీ కమిటీ ద్వారా దర్యాప్తు జరిపించాలి’ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘అభివృద్ధి చెందిన భారత దేశం’ దార్శనికతను పార్లమెంటుకు సమర్పించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అదానీ గ్రూప్‌పై వొచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ ‌చేశారు. మోదీ మాట్లాడుతూ, కొందరి భాష, ప్రవర్తన భారత దేశానికి నిరాశ కలిగిస్తున్నాయన్నారు. తనపైనా, తన ప్రభుత్వంపైనా ప్రతిపక్షాల ఆరోపణలను ప్రస్తావిస్తూ, వారి వద్ద బురద ఉందని, తన వద్ద గులాల్‌ ఉం‌దని, ఎవరి దగ్గర ఏది ఉంటే, దానినే వారు విసురుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ పరిపాలించిన సమయంలో అభివృద్ధికి ఆటంకాలు సృష్టించిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ‌పరిపాలించిన ఆరు దశాబ్దాల కాలంలో మన దేశం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, అదే సమయంలో చిన్నచిన్న దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. ప్రజలు సమస్యలను ఎదుర్కుంటున్న సమయంలో ఆ సమస్యలకు పరిష్కారాలను అందజేయవలసిన బాధ్యత కాంగ్రెస్‌ ‌పార్టీకి ఉందని, కానీ ఆ పార్టీ నేతల ప్రాధాన్యతలు, ఉద్దేశాలు వేరు అని తెలిపారు. ప్రజలు ఎదుర్కునే సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం తాము కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, ఖర్గే చెప్పినట్లుగా పునాదుల నిర్మాణానికి కాంగ్రెస్‌ ‌ప్రయత్నించి ఉండవచ్చునని, అయితే కాంగ్రెస్‌ ‌పాలనా కాలంలో కేవలం గోతులను మాత్రమే తవ్వారని దుయ్యబట్టారు. గడచిన మూడు, నాలుగేళ్ళలో దాదాపు 11 కోట్ల ఇళ్లకు నల్లా నీటి కనెక్షన్లు అందినట్లు తెలిపారు. సామాన్యులను సాధికారులను చేయడం కోసం జన్‌ ‌ధన్‌ ‌ఖాతా ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. గడచిన తొమ్మిదేళ్లలో సుమారు 48 కోట్ల జన్‌ ‌ధన్‌ ‌ఖాతాలను తెరిచినట్లు తెలిపారు.

Leave a Reply