Take a fresh look at your lifestyle.

ఉచితాలు తీసివేయడం అనుచితం

సుప్రీం కోర్ట్,  ఇతర కింది కోర్టులు కూడా ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల విదేశీ ఆంక్షలతో ప్రభావితమైనటువంటి విధానాలకు మద్దతు ఇస్తున్నాయనే విషయం పై దేశంలో ఒక చర్చ జరుగుతోంది. మళ్ళీ నిన్న సుప్రీంకోర్టు ఉచితాలపై ఒక కమిటీ వేసి తద్వారా రాజకీయ పార్టీలు ఉచితాలను దుర్వినియోగం చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని ప్రభుత్వానికి సూచన చేసింది.  ఉచితాలను తక్కువ చేయాలనేటువంటి లేదా తీసివేయాలని అటువంటి భావన అంతర్లీనంగా ఈ సూచనలో ఉంది. నోబెల్‌ ‌ప్రైజ్‌ ‌గ్రహీతలు అభిజిత్‌ ‌బెనర్జీ, ఆయన భార్య ఈస్టర్‌ ‌డఫ్లో రాసిన ‘పూర్‌ ఎకనామిక్స్’ అనే పుస్తకంలో  50 దేశాల్లో వివిధ రంగాలపై ఉచితల ప్రభావం పై పరిశోధనలు చేసి గణాంకాలతో సహా ఉచితాల వల్ల అత్యంత బీదరికంలో ఉన్న ప్రజలను వారి బీదరికపు ఉచ్చు (పావర్టీ ట్రాప్‌) ‌నుండి రక్షించవచ్చు అని నిరూపించారు.

ఆర్థిక సంస్కరణల అనంతరం ప్రజల దగ్గరనుండి ప్రభుత్వాలు వారికి చట్టాంగ పరంగా కలిపించ వలసిన సేవల పై కూడా రుసుము వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా పన్నులు విధించే సేవలు పైన పదుల సంఖ్య నుండి వందల సంఖ్యకు చేరాయి. ఇవి దిగువ తరగతి దిగువ వాళ్లపై కూడా భరించలాని భారాన్ని వేశాయి. మధ్య తరగతి వాళ్లకు కూడా ఇదివరకు ఇలాంటి పన్నులు మధ్య, ధనిక తరగతి వాళ్ళు కొనుక్కునే సేవల మీదనే విధించారు.  ఈ మధ్య, జీఎస్టీ చట్టం మొదట హామీలకు విరుద్ధంగా నిత్యావసర వస్తువు లైన బియ్యం, పాలు పెరుగు పై జీఎస్టీ  విధించారు.ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల అనుకరణ. కానీ ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజా సంక్షేమ సౌకర్యాలు మాత్రం ఇవ్వవు. అయితే  ఇప్పటికే ఈ విధానాల ప్రభావం మన దేశంలో అటు కార్మికుల యొక్క హక్కులను అత్యధికంగా తగ్గించే విధానాలు చేపట్టబడ్డాయి. ఒకవైపు 45 సంవత్సరాలు ఎన్నడూ లేనంతగా మన దేశంలో నిరుద్యోగత  పెరిగిపోయిందనేది ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఈ ఉచితాలు ముఖ్యంగా మధ్యాహ్న భోజనము మరియు అంగన్వాడి ద్వారా గర్భిణీ స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు పోషకాహార నివ్వడం వల్ల అటు చదువు మధ్యలో వదిలిపెట్టిన విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ఎంతో కొంత మన దేశంలో బీద స్త్రీల ఆరోగ్యము,  చిన్న పిల్లల తరుగుదల లోపాలు సరిదిద్ద బడ్డాయి అనేది గణాంకాల ద్వారా నిరూపితమైనటువంటి విషయం.

ఉదాహరణకి మనం మానవ అభివృద్ధి సూచిక విలువ 1990లో 0.429 నుండి 0.645కు పెరిగింది అంతేకాకుండా మాతృత్వ మరణాల సంఖ్య 1990లో లక్షకు 556 నుండి 130 కి తగ్గింది.ఇంకా మన దేశంలో ప్రభుత్వాల చేయూత అవసరం ఉన్నటువంటి వారు లక్షల్లో ఉన్నారు. మన వ్యవసాయదారుల తలసరి అప్పు 74100 రూపాయలు ఉంది. మన నగరాల్లో ఉండే బీదల తలసరి అప్పు లక్ష ఇరవై వేల రూపాయలు. కొన్ని గణాంకాల ప్రకారం రోజుకు 100 రూపాయల కన్నా తక్కువ సొమ్ము మీద బతికే వారి సంఖ్య రకరకాల సంస్థల ప్రకారం 25% నుండి 70 శాతం వరకు ఉంది.  ఇన్ని కోట్ల మందికి ఉద్యోగం ప్రభుత్వాలు ఇప్పించగలిగితే ఈ ఉచితాల అవసరం ఉండదు. ఈ ఉచితాల వల్ల ఉన్నవారి దగ్గర పన్నులు వసూలు చేసి లేనివారికి పంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆర్థిక  కిసమానత్వానిక మొట్టమొదటి పరిష్కారం ఇదొక్కటే.   లేకపోతే అరాచకాలు సాంఘిక ఘర్షణలు ఏర్పడతాయి. వాటిని నక్సలైట్‌ ‌పేరు మీద  ఇతర విపరీతత్వ భావల పేరు మీదనో అణచివేయడం వల్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు.

బీద ప్రజలకు జరిగినటువంటి ఉన్నతి మరి ఉచితాల ద్వారానే సాధ్యమైంది కదా?ప్రభుత్వాలు మన ఆదేశిక సూత్రాల ప్రకారం కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని విద్యా రంగాలపై ఎక్కువ ఖర్చు పెట్టి ఈ అవకాశాల లభ్యత విషయల్లో అందరికి సమానత్వం వచ్చేలా చేయవలసిన బాధ్యత మన ప్రభుత్వాలపై విధించింది. మొన్న కోవిడ్‌ ‌వచ్చినప్పుడు కంప్యూటర్లు లేకపోవడం వల్ల చాలామందికి దూరవిద్య అవకాశం లేకుండా పోయింది. కొన్ని రాష్ట్రాలలో ఒకప్పుడు లాప్టాప్‌  ‌టీవీలు ఇవ్వడం వల్ల పిల్లలకు మొన్న కోవిడ్‌ ‌మహమ్మారి సమయంలో అలాంటి పిల్లలకు దూరవిద్య ద్వారా విద్య ఆటంకం జరగకుండా ఉంది అనే  నిజం ఎవరూ కాదనలేరు.
ప్రభుత్వాలు అందరికీ ఉపాధి కల్పించాలి.  లేకపోతే ఉచితాల వల్ల ఉపాధి లేనివారికి తక్కువ సంపాదన ఉన్నవారికి అవకాశాలు కల్పించాలి.  రెండు చేయడం లేదు అంటే అప్పుడు ప్రభుత్వాల యొక్క అసమర్ధత అవుతుంది. మన దేశంలో అసమానత్వం ఎక్కువ స్థాయిలో ఉంది అనేది నిరూపించబడినవి. అందరికీ కనబడే విషయమే. ఈ అసమానత్వాన్ని జీని ఇండెక్స్ ‌తో కొలుస్తారు. ఈ సూచిక ప్రకారం మన దేశంలో అసమానత్వం ఎక్కువగా ఉండడమే కాకుండా ఈ మధ్యలో పెరుగుతుందనేది నిర్ధారితమైంది. మానవ అభివృద్ధి సూచికలో 189 దేశాల్లో మనది 131 సంఖ్య దగ్గర ఉన్నది. ఇది కూడా అసమానత్వం మరియు బీదరికాన్ని సూచిస్తుంది. మన దేశంలో 1980 నుండి 2020 మధ్యలో దేశ సంపదలో ధనికుల వాట 228 నుంచి 556% వరకు పెరిగిందని,  జనాభాలో ఆర్థికంగా   ఉన్నత స్థాయిలో 10 శాతం ఉన్న ధనికులకు దేశ సంపదలో 74 శాతం సంపద కలిగి ఉన్నారని నిజాలు విస్మరించరాని, విస్మరించ కూడని ప్రమాదకరమైనటువంటి విషయాలను. ఇంకా ఉచితాలు ఇవ్వద్దు అని వాదించటం అమానుషం.

ఈ మధ్య కోవిడ్‌ ‌వచ్చిన తర్వాత కూడా వ్యాపారాలు దెబ్బతిన్నాయనే మిషతో  కార్పొరేట్‌ ‌సంస్థల యొక్క ఆదాయంపై టాక్స్ 35% ‌నుండి 25% తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి లక్ష కోట్లు ఆదాయం పడిపోయింది.  పోనీ వీళ్ళు ఏమైనా ఉపాధి కల్పించారా అంటే అదీ లేదు. ఆర్థిక సంస్కరణ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో పరిశోధనలు ఉపాధి లేని అభివృద్ధికి దారితీసాయి తద్వారా  దారితీసాయనేది నిరూపించాయి.అంతేకాకుండా ఇతరత్రా ఉన్నత మధ్య తరగతి, వారికి మధ్యతరగతి వారికి ఇచ్చినటువంటి ఆర్థిక వేసులు బాటు చర్యల ద్వారా దేశానికి నాలుగు లక్షల నుంచి 5 లక్షల కోట్ల అదనపు ఖర్చు పెరిగింది అని విషయం కూడా ఆర్థిక సంఘ గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా వ్యాపారాలకు విపరీతంగా ఎలాంటి నియంత్రణ లేకుండా అప్పులు ఇవ్వడం వల్ల దేశంలో నిరర్థక ఆస్తులు -అంటే బ్యాంకులు ప్రజలు దాచుకున్న సొమ్ముని ఈ వ్యాపారస్తులకు ఇవ్వడం వల్ల వారు తిరిగి ఇవ్వకపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చినటువంటి నష్టం- నాలుగు లక్షల కోట్ల నష్టం ఈ గత కొన్ని సంవత్సరాల్లో సంభవించింది. ఊచితాల కోసం ప్రభుత్వాలు పెట్టే ఖర్చు ఈ విధంగా ఉన్నవాళ్లకు పంచే దానికంటే తక్కువే ఉంటుంది. గత ఏడు సంవత్సరాల లో ఒక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ‌రూపంలో రెండు కోట్ల కోట్లు రూపాయల పైచిలుకు ఖర్చుపెట్టింది. అందులో ఉచిత ఎంత అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉచితాలు ఆపడం కానీ తక్కువ చేయడం కానీ  చాలా ప్రమాదకరమైన విషయం అనేది గుర్తించాలి.
డాక్టర్‌. ‌మండువ ప్రసాదరావు

Leave a Reply