Take a fresh look at your lifestyle.

తెలంగాణలో తగ్గుతున్న కొరోనా ఉధృతి

కొత్తగా మరో 2070 పాజిటివ్‌ ‌కేసులు..18 మంది మృతి
హైదరాబాద్‌,‌జూన్ 5: ‌తెలంగాణలో కొరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2070 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. 3,364 మంది కోలుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసులు 5,89,7344కు పెరిగాయి. వీరిలో 5,57,162 మంది కోలుకున్నారు.

ఇంకా 29,208 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 3364 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,38,182 సాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో కొవిడ్‌ ‌రికవరీ రేటు 94.47.81 శాతంగా ఉంది. మరణాలు రేటు 0.57 శాతంగా ఉందని పేర్కొంది.

Leave a Reply