Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా తగ్గుతున్న కొరోనా కేసులు

  • స్వల్పంగా పెరుగుతున్న మరణాలు
  • 24 గంటల్లో 84.332 మందికి పాజిటివ్‌..4,002 ‌మంది మృతి
  • సెకండ్‌ ‌వేవ్‌ ‌దేశవ్యాప్తంగా 719 మంది వైద్యులు మృతి

దేశ వ్యాప్తంగా కొరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా…మరణాల సంఖ్య మాత్రం స్వల్పంగా పెరిగింది. కేసుల సంఖ్య లక్ష లోపే నమోదవుతుండగా..24 గంటల్లో కొత్తగా 84,332 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు అవగా… 4,002 మంది మృతి చెందారు. కొద్ది రోజులుగా 2 వేల పైగా మరణాలు నమోదవుతుండగా మధ్యలో ఒక్క రోజు బీహార్‌లో ఒక్కసారిగా అనూహ్య రీతిలో పెరిగిన కారణంగా 6 వేలకు పైగా నమోదు కాగా శనివారం 4,002 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 1,21,311 మంది కొరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. అలాగే మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,79,11,384గా ఉంది. ప్రస్తుతం 10,80,690 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కొరోనాతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,67,081గా ఉంది.

ఇప్పటి వరకు 24,96,00,304 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది. ఇక కోవిడ్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌లో సామాన్య ప్రజలతో పాటు కోవిడ్‌ ‌బాధితులకు చికిత్స అందించిన అనేక మంది వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. సెకండ్‌ ‌వేవ్‌లో దేశవ్యాప్తంగా 719 మంది వైద్యులు మృతి చెందారు. బీహార్‌ ‌రాష్టంలో గరిష్టంగా 111 మంది డాక్టర్లు మృతి చెందగా… ఢిల్లీలో 109 మంది మృతి చెందారు. ఉత్తప్రదేశ్‌లో 79 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ ‌బెంగాల్‌లో 63 మంది వైద్యులు, రాజస్థాన్‌లో 43 మంది వైద్యులు, తెలంగాణలో 36 మంది వైద్యులు, ఏపీలో 35 మంది వైద్యులు, గుజరాత్‌లో 37 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ అధికారికంగా ప్రకటించింది.

Leave a Reply