Take a fresh look at your lifestyle.

కొరోనా తో రాష్ట్ర ఆదాయం తగ్గినా సంక్షేమం ఆగదు

  • ఆందోళ్ నియోజకవర్గ పర్యటనలో మంత్రి హరీశ్ రావు
  • 2 కోట్లతో ఆందోళ్ – జోగిపేట టౌన్ హాల్ కు శంకుస్థాపన
కొరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా ప్రజల సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేదని ఆర్థిక మంత్రి హరీశ్ రావు  చెప్పారు. శుక్రవారం ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు‌.2 కోట్లతో  నిర్మించనున్న ఆందోల్  – జోగిపేట టౌన్ హాలుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం   మహిళలకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్ లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కుల, మత బేధాలు లేకుండా  నిరుపేదలైన ఆడ పిల్లల వివాహానికి లక్ష నూట పదహార్లు ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. దేశంలో మరే రాష్ట్రం ఇలాంటి పథకాన్ని అమలు చేయడం లేదన్నారు.ఒక్క తెలంగాణ రాష్ట్రం లో, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయన్నారు.కొరోనాతో ఆదాయం తగ్గినా ఈ ఒక్క నెలలోనే కల్యాణ లక్ష్మి పథకం కింద రు.401 కోట్లు  చెల్లించామన్నారు. ఇటీవలే రైతు బంధు కింద రు.7400 కోట్లు సాయమందించామన్నారు.
ఆసరా పెన్షన్లు రెండు వేల రూపాయలు సైతం అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో ఆందోల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా సభలు, సమావేశాలు, శుభ కార్యాలకు వినియోగించేందుకు గాను 2  కోట్లతో టౌన్ హాల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.  అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయించి టౌన్ హాలును అన్ని హంగులతో నిర్మిస్తామని చెప్పారు.  ఆందోల్  లో 320 డబుల్ బెడ్ రూం ల నిర్మాణం పూర్తయిందన్నారు. అర్హులైన నిరు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావును మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. నిరుపేదల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించారు. కోటీ 20 లక్షల తో డ్రైన్లు ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. జోగిపేటలోనూ డబుల్ బెడ్ రూంల నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే వాటిని అర్హులను గుర్తించి  ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎంపీ బీబీ పాటిల్జెడ్పీ ఛైర్మన్ జయపాల్ రెడ్జి , కలెక్టర్ హనుమంతరావు, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి,పాల్హొన్నారు.

Leave a Reply