Take a fresh look at your lifestyle.

దేశంలో తగ్గిన కోవిడ్‌ ‌కొత్త కేసులు

  • తాజాగా కొత్తగా 26,115 మందికి పాజిటివ్‌..252 ‌మంది మృతి
  • 81.85 కోట్ల డోసుల టీకా డోసుల పంపిణీ

దేశంలో రోజువారీ కోవిడ్‌ ‌కొత్త కేసులు తగ్గాయి. తాజాగా కొత్తగా 24 గంటల్లో 26,115 మందికి కోవిడ్‌ ‌పాజిటివ్‌గా నమోదు కాగా 252 మంది మహమ్మారికి బలయ్యారు. మంగళవారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా 81.85 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది. కాగా దేశవ్యాప్త రికవరీ రేటు 97.75 శాతానికి చేరింది. కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 86వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుత యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 3,09,575 కాగా దేశంలోని మొత్తం పాజిటివ్‌ ‌కేసుల్లో ఇది 0.92 శాతం. దేశవ్యాప్తంగా కొరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. తాజాగా 24 గంటల్లో మొత్తం 14,13,951 పరీక్షలు నిర్వహించగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంగా 55,50,35,717 పరీక్షలు నిర్వహించారు. వారపు పాజిటివిటీ రేటు 2.08 శాతంగా ఉంది. గత 88 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతుంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.85 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 22 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 105 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతుంది.

Leave a Reply