Take a fresh look at your lifestyle.

దేశంలో తగ్గిన కోవిడ్‌ ‌కొత్త కేసులు

  • తాజాగా 29,616 మందికి పాజిటివ్‌..290 ‌మంది మృతి
  • ఒక్క కేరళలోనే 17,983 కేసులు నమోదు
  • సాధారణ పరిస్థితులు రావాలంటే అప్రమత్తతే ముఖ్యం ్కఆ ముప్పు తొలగిపోలేదని ఎయిమ్స్ ‌డైరెక్టర్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా హెచ్చరిక

దేశంలో కొరోనా కొత్త కేసులు కొద్దిగా తగ్గి మళ్లీ 30 వేల దిగువకు చేరుకున్నాయి. తాజాగా 29,616 మందికి పాజిటివ్‌ ‌నమోదు కాగా వైరస్‌ ‌కారణంగా 290 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,24,419కు చేరింది. ఇందులో 3,28,76,319 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి బయట పడగా మొత్తంగా 4,46,658 మంది మృతిచెందారు. మరో 3,01,442 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 7 గంటల వరకు 28,046 మంది బాధితులు కోలుకున్నారని, దీంతో రికరీ రేటు 97.78 శాతానికి చేరిందని తెలిపింది. దేశంలో కొత్తగా నమోదైన కేసుల్లో 17,983 కేసులు కేరళలోనే ఉన్నాయని పేర్కొన్నది. రాష్ట్రంలో కొత్తగా 127 మంది మరణించారని వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 71,04,051 మందికి వ్యాక్సినేషన్‌ ‌చేశామని, దీంతో ఇప్పటివరకు మొత్తం 84,89,29,160 కొరోనా టీకా డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. ఇదిలావుంటే కొరోనా మహమ్మారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా సాధారణ పరిస్థితులు వస్తాయని ఎయిమ్స్ ‌డైరెక్టర్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా అభిప్రాయపడ్డారు. మాస్కులు దరించడం, పరిశుభ్రంగా ఉండడం వంటివి చేస్తూనే ఉండాలన్నారు.

వొచ్చే 6 నుంచి 8 వారాల పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరిస్తే.. మనం దీన్నుంచి బయటపడి కోవిడ్‌ ‌ముందు నాటి పరిస్థితులకు వెళ్లొచ్చని రణ్‌దీప్‌ ‌గులేరియా పేర్కొన్నారు. మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, అందువల్ల ప్రజలు రాబోయే పండగల సీజన్‌లో జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. కోవిడ్‌ ‌టీకా తీసుకున్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. టీకా రోగాన్ని తీవ్రం కాకుండా చూస్తుందని, టీకా తీసుకున్నవారికి ఎవరికైనా ఒకవేళ కొవిడ్‌ ‌సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుందన్నారు. అయితే టీకాలు తీసుకున్నవారి ద్వారా..టీకా తీసుకోనివారికి వైరస్‌ ‌సోకితే అలాంటివారిలో తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ఈమేరకు అందరూ తగిన జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరించారు. కోవిడ్‌ ‌విషయంలో ప్రస్తుతం దేశంలో ఆశావహ పరిస్థితులు ఉన్నాయని, రోజురోజుకీ వైరస్‌ ‌తిరోగమనంలో సాగుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆయన స్పష్టం చేశారు.

పండగల సీజన్‌ ‌మళ్లీ కేసులను పెంచే పరిస్థితికి తీసుకుని రాకూడదన్నారు. మనం మహమ్మారి అంతాన్ని చూడాలనుకుంటున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ‌ధరించడంతోపాటు, గుంపులుగా చేరడం మానుకోవాలన్నారు. కొరోనా చికిత్సకు అందించే ఔషధాల నుంచి ఐవర్‌మెక్టిన్‌, ‌హైడ్రాక్సీక్లోరోక్విన్‌ (‌హెచ్‌సీక్యూ)ని తొలగిస్తూ భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌), ‌కోవిడ్‌-19 ‌నేషనల్‌ ‌టాస్క్‌ఫోర్స్‌లు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు శుక్రవారం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేశాయి. కోవిడ్‌ ‌బాధితుల్లో మరణాలు, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ఇవి పెద్దగా ప్రభావం చూపడం లేదని, అందువల్ల వాటిని జాబితా నుంచి తొలగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అజిత్రోమైసిన్‌తో కలిపి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఇచ్చినప్పుడు దాని ప్రభావం తీవ్రంగా ఉంటోందన్నది కూడా మరో కారణమని పేర్కొన్నాయి. ఎయిమ్స్ ‌నిర్వహించిన అధ్యయనంలోనూ ఐవర్‌మెక్టిన్‌ ‌వల్ల వైరల్‌ ‌లోడ్‌లో కానీ, రోగ లక్షణాలు కొనసాగే సమయంలో కానీ తగ్గుదల కనిపించలేదని తేలింది. దేశంలో క్రమేపీ తగ్గుముఖం పడుతున్న కోవిడ్‌ ‌క్రియాశీలక కేసుల సంఖ్య శుక్రవారం 3 లక్షలకు చేరువైంది. రోజువారీ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది.

Leave a Reply