Take a fresh look at your lifestyle.

వర్షాకాలంలో తగ్గిన దేశీయ సాగు విస్తీర్ణం

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడి
ఈ ఏడాది వర్షాకాలం పంటల సాగు విస్తీర్ణం తగ్గడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. వర్షాలు సజావుగా కురవకపోవడం వల్ల సాగు, వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా ప్రభావం పడింది. వరిని పెద్ద ఎత్తున ఎగుమతి చేసే దేశాల్లో భారత దేశం ఒకటి. వంట నూనెలను మన దేశం భారీగా దిగుమతి చేసుకుంటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో వరి ఎగుమతులు తగ్గబోతుండగా, వంట నూనెల దిగుమతులు పెరుగుతాయి.

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం వరి, పత్తి, సోయాబీన్స్ ‌వంటి వర్షాకాల పంటల సాగు విస్తీర్ణం 12 శాతం తగ్గింది. జూలై 16 నాటికి 61.19 మిలియన్‌ ‌హెక్టార్లలో ఈ పంటలను నాటారు. చెరకు సాగు మాత్రం 1.7 శాతం పెరిగింది. ఇప్పటి వరకు 5.37 మిలియన్‌ ‌హెక్టార్ల భూమిలో చెరకును రైతులు నాటారు. పత్తిని 9.84 మిలియన్‌ ‌హెక్టార్ల భూమిలో నాటారు. అంటే గత ఏడాది కన్నా ఈ పంట సాగు విస్తీర్ణం 13 శాతం తగ్గింది. వరి గత ఏడాది 17.44 మిలియన్‌ ‌హెక్టార్ల విస్తీర్ణంలో సాగయ్యింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 16.19 మిలియన్‌ ‌హెక్టార్లలో నాట్లు వేశారు. పంటల సాగు విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణం ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురవకపోవడమే.

Leave a Reply