Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో తగ్గిన కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 208 మందికి పాజిటివ్‌..ఇద్దరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు తగ్గాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 208 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 220 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా ఇద్దరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 49 కేసులు నమోదవగా, వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలో 20 కేసులు, కరీంనగర్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలలో 15 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,63,662 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,906కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,54,765 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 4,991గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply