24 గంటల్లో 35,342 మందికి పాజిటివ్..483 మంది మృతి
దేశంలో కొత్తగా 35,342 కొరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 483 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకూ కొరోనా కేసుల సంఖ్య 3,12,93,062కు చేరుకోగా..4,19,470 మంది మృతి చెందారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 38,740 మంది కోలుకోగా..యాక్టివ్ కేసుల సంఖ్య 4,05,513కు చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు 42.34 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ జరిగింది. కొరోనా వైరస్ వల్ల దేశంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 4,19,470 గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్నది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పక్రియ జోరుగా సాగుతున్నది. ఇప్పటి వరకు 42,34,17,030 మందికి కోవిడ్ టీకాలు వేశారు.
కర్నాటక రాష్ట్రంలో కోవిడ్ కేసులు పలు జిల్లాల్లో తగ్గుముఖం పట్టినా రాజధాని బెంగళూరులో ప్రభావం కొనసాగుతూనేవుంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 1653 మందికి పాజిటివ్ నిర్దారణ కాగా బెంగళూరులో 418 మందికి వైరస్ సోకింది. దక్షిణ కన్నడలో 229 మంది, మైసూరు 134, కొడగు 107, తుమకూరు 104 మందికి పాజిటివ్ నిర్దారణ కాగా, 14 జిల్లాల్లో 100 మందిలోపు బాధితులు నమోదయ్యారు. 2572 మంది డిశ్చార్జ్ కాగా 31 మంది మృతి చెందారు. 16 జిల్లాల్లో ఐదు మందిలోపు మృతి చెందగా 14 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతి చెందలేదు. ఇంకా 24,695 మంది చికిత్సలు పొందుతున్నారు.